ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్టు చేశారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ప్రస్తుతం తిహార్ జైల్లో సీబీఐ కస్టడీలో ఉన్న ఆయనను సుమారు రెండు గంటలపాటు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
చిదంబరాన్ని విచారించవచ్చని అధికారులకు ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతినిచ్చిన నేపథ్యంలో బుధవారం ఉదయమే తిహార్ జైలుకు చేరుకున్నారు ఈడీ అధికారులు. అనంతరం చిదంబరాన్ని విచారించి అరెస్టు చేశారు. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును ఈడీ అధికారులు అభ్యర్థించే అవకాశముంది.
విచారణ సందర్భంగా చిదంబరం భార్య నళినీ చిదంబరం, కుమారుడు కార్తీ చిదంబరం కూడా తిహార్ జైలుకు వెళ్లారు. చిదంబరం 55 రోజులుగా సీబీఐ జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.
ఇదీ చూడండి: 'సరిహద్దు సవాళ్ల పరిష్కారంలో సైన్యం భేష్'