జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్ సెక్టార్‌లో కీలకమైన సీఆర్‌పీఎఫ్ బాధ్యతలను తొలిసారి మహిళా ఐపీఎస్ అధికారి చారుసిన్హాకు అప్పగించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన శ్రీనగర్ సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్(ఐజీ)గా 1996 బ్యాచ్‌కు చెందిన ఈ తెలంగాణ కేడర్ అధికారిని జమ్మూ సెక్టార్ నుంచి శ్రీనగర్‌కు బదిలీచేస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
చారుసిన్హా ఇదివరకు బిహార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌కు నేతృత్వం వహించి నక్సల్స్ ఏరివేత కార్యకలాపాలను చురుగ్గా నిర్వహించారు. 2005లో ప్రారంభమైన శ్రీనగర్ సెక్టార్ సీఆర్‌పీఎఫ్ విభాగానికి గత 15 ఏళ్లలో మహిళా అధికారి ఎవరూ ఐజీస్థాయిలో పనిచేయలేదు.
ఇదీ చదవండి- మళ్లీ అదే కథ.. చొరబాటుకు చైనా విఫలయత్నం!