ETV Bharat / bharat

జాబిల్లి కోసం: చంద్రయాన్​-1 సూపర్​ హిట్​.. కానీ...

చంద్రయాన్​-1... 8 ఏళ్ల క్రితం అందరూ ఈ ప్రాజెక్టు గురించే చర్చించుకున్నారు. గ్రహాంతరాలు దాటిన భారత మేధో శక్తిని చూసి గర్వపడ్డారు. ఇంతకీ... చంద్రయాన్​-1 లక్ష్యం ఏంటి..? ఇస్రో ప్రణాళికలు ఎంతవరకు ఫలించాయి..?

జాబిల్లి కోసం: చంద్రయాన్​-1 సూపర్​ హిట్​.. కానీ...
author img

By

Published : Sep 6, 2019, 3:59 PM IST

Updated : Sep 29, 2019, 3:56 PM IST

జాబిల్లి కోసం: చంద్రయాన్​-1 సూపర్​ హిట్​.. కానీ...

చీకటి పడితే చాలు... లక్షల మైళ్ల దూరంలో కనిపిస్తూ ఊరించే జాబిల్లి గురించి కథలు చెప్పుకుంటాం. చందమామ రావే అంటూ పాటలు పాడుకుంటాం. చంద్రుడు... కథలు, పాటలకే పరిమితమా..? అక్కడకు చేరుకోలేమా..? శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేమా..? ఈ ప్రశ్నలకు జవాబుల కోసం ఎప్పటినుంచో వెతుకుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.

2008లోనే తొలిసారి...

జాబిల్లిపైకి చేరుకునేందుకు 2008లోనే భారత్​ చంద్రయాన్​-1 పేరుతో ఓ ప్రాజెక్టు చేపట్టింది. చంద్రయాన్​-1 ఆర్బిటార్​ అక్కడి కక్ష్యలోనే తిరిగి సమాచారాన్ని సేకరించి భూమికి పంపింది. అంతరిక్ష రంగంలో భారత ముద్ర ఉండాలన్న బలమైన ఉద్దేశంతో 35 కిలోల ఇంపాక్టర్​ను చంద్రుడి ఉపరితలంపైకి జారవిడవగా... అది జాబిల్లిని బలంగా ఢీకొట్టింది. ఇంపాక్టర్​ బద్దలయ్యేలోపే.. చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఛాయాచిత్రాలు, సమాచారాన్ని సేకరించి భూమికి చేరవేసింది. దాదాపు 3 వేల సార్లు పరిభ్రమించి.. 70 వేల వరకు ఫొటోలను పంపింది.

చిన్న చిన్న ఇబ్బందులతో 2009 ఆగస్టు 29న చంద్రయాన్​-1తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. రెండేళ్లు పనిచేసేలా రూపొందించినా 10 నెలలకే ప్రస్థానం ముగిసింది.

అయినా.. భారత అంతరిక్ష రంగంలో చంద్రయాన్​-1 ఓ అద్భుతం, గొప్ప మైలురాయి, మరిచిపోలేని ఘనత. తొలిసారి.. చందమామపై నీరు, మంచు​ ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించింది చంద్రయాన్​-1.

అమెరికా పంపిన 'మూన్​ మినరాలజీ మ్యాపర్' నీటి జాడను తొలిసారిగా గుర్తించినా... తదనంతరం ఇస్రో చంద్రయాన్​-1 ద్వారా నిర్ధరించింది.

అమెరికా పరికరం వల్లే..

మొదట చంద్రుడి కక్ష్యలోని ఉష్ణం వల్లే చంద్రయాన్​-1 అర్ధంతరంగా ముగిసిందని భావించినా.. అమెరికా నుంచి దిగుమతి చేసుకొని పరిశోధనల్లో వాడిన డీసీ-డీసీ కన్వర్టర్​ అనే బుల్లి పరికరమే కారణమని వెల్లడైంది. అనంతరం దానినే సమర్థంగా దేశీయంగానే రూపొందించి.. ప్రతిష్టాత్మక మంగళ్​యాన్​ ప్రయోగంలోనూ విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. చంద్రయాన్​-2లోనూ అదే వినియోగిస్తున్నారు.

పూర్తిగా స్వదేశానివే..

చంద్రయాన్​-1లో ప్రయోగించిన 11 పరికరాల్లో భారత్​వి 5 మాత్రమే. కానీ.. చంద్రయాన్​-2 లో పంపుతున్న 14 పరికరాల్లో 13 స్వదేశానికి చెందినవే. ఒకటి అమెరికాకు చెందినది. అదేమంత పెద్ద పరికరమూ కాదు.

వినువీధిలో భారత సత్తా చాటాలని మిస్సైల్​ మ్యాన్​, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్​ కలాం కన్న కల చంద్రయాన్​-1. అది పూర్తిగా సాకారమయ్యే దిశగా చేపట్టిన ప్రయోగం... చంద్రయాన్​-2.

ఇదీ చూడండి: చంద్రయాన్2 ల్యాండింగ్​పై అమెరికా శాస్త్రజ్ఞుల్లో ఉత్సాహం

New Delhi, Sep 06 (ANI): Voting is underway for Jawaharlal Nehru University Students' Union elections. Total 14 candidates are in the fray for various posts in the students union of the university. Polling is being held through ballot papers.
Last Updated : Sep 29, 2019, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.