చంద్రుని ఉపరితలంపై స్పెక్ట్రోస్కోపిక్ అధ్యయనాన్ని ప్రారంభించింది చంద్రయాన్-2 ఆర్బిటర్. ఇందుకోసం ఆర్బిటర్లో అమర్చిన ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్టోమీటర్(ఐఐఆర్ఎస్) పేలోడ్ పనిచేయడం మొదలుపెట్టింది.
చంద్రునిపై పడే సూర్య కిరణాల తీవ్రత లెక్కింపునకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి. జాబిలి నుంచి పరావర్తనం, ఉద్గారం చెందే సూర్యరశ్మిని ఐఐఆర్ఎస్ లెక్కగడుతుంది. వీటిని ఆధారంగా చేసుకుని చంద్రుని పరిణామ క్రమాన్ని విశ్లేషించటమే ఈ పరిశోధన ప్రధాన లక్ష్యం.
ప్రకాశవంతమైన చిత్రం
ఇందులో భాగంగానే మొదటిసారి చంద్రుని ప్రకాశవంతమైన ఛాయాచిత్రాన్ని తీసింది ఆర్బిటర్. ఈ చిత్రంలో చంద్రుని ఉత్తర గోళంలోని ఆవలివైపును బంధించింది. ఈ చిత్రంలో సోమర్ఫీల్డ్, స్టెబ్బిన్స్, కిర్క్వుడ్ లాంటి అగ్ని పర్వతాలను చూడొచ్చు. సూర్యుని కాంతిని పర్వత బిలాలు ఎలా పరావర్తనం చెందిస్తున్నాయో ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదీ చూడండి: దశాబ్దాల 'అయోధ్య' సమస్యకు పరిష్కారమేమిటో?