మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. ఈ నెల 6నే కొచ్చర్ ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఆ తేదీని మార్చాలన్న ఆమె విన్నపం మేరకు10న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
గత నెలలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను పలుసార్లు విచారించిన ఈడీ.... అవసరమైతే జప్తు చేసేందుకు గానూ.. వీరి ఆస్తుల వివరాలను సమగ్రంగా విశ్లేషించేందుకు సిద్ధమవుతోంది.
మార్చి 1న చందా కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్ ధూత్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. చందాకొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓగా ఉన్నప్పుడు గుజరాత్‌కు చెందిన రెండు ప్రైవేటు సంస్థలకు నిబంధనలకు విరుద్దంగా రుణాలు ఇప్పించారన్న ఆరోపణలపైనా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చూడండి: కర్ణాటకలో ఈ నెల 12న మంత్రివర్గ విస్త'రణం'