ETV Bharat / bharat

బెంగాల్ హింసాకాండపై కేంద్రం ఆందోళన - హింస

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని సూచించింది.

బెంగాల్ హింసాకాండపై కేంద్రం ఆందోళన
author img

By

Published : Jun 9, 2019, 9:13 PM IST

Updated : Jun 9, 2019, 11:28 PM IST

బెంగాల్ హింసాకాండపై కేంద్రం ఆందోళన

పశ్చిమ బెంగాల్​లో కొనసాగుతున్న హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. లోక్​సభ ఎన్నికలు ముగిసినా రాష్ట్రంలో హింస కొనసాగుతుండటం మమతాబెనర్జీ ప్రభుత్వ వైఫల్యానికి చిహ్నమని విమర్శించింది.

బంగాల్​లో లా అండ్ ఆర్డర్​, శాంతి భద్రతలు కాపాడాలని... ప్రజాశాంతిని నెలకొల్పాలని మమతా బెనర్జీ ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచించింది.

"గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో జరుగుతున్న హింస.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యాన్ని సూచిస్తోంది. శాంతిభద్రతలు అమలు చేయలేక... ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పలేకపోయింది."- కేంద్ర హోంమంత్రిత్వశాఖ

విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని, వారిని విధుల నుంచి తొలగించాలని హోంమంత్రిత్వశాఖ సూచించింది.

హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బంగాల్​ ఉత్తర 24 పరగణా జిల్లాలో శనివారం జరిగిన హింసాకాండలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇంతకు మునుపూ రాష్ట్రంలో పలువురు వ్యక్తులు హింసాకాండకు బలయ్యారని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: తప్పించుకున్నా.. విధి వక్రించి బలి తప్పలేదు!

Intro:Body:

ioio

Conclusion:
Last Updated : Jun 9, 2019, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.