సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ సహా మొత్తం 40 వేరు వేరు భద్రతా దళాల నుంచి జవాన్లను ఇందులో భాగస్వాముల్ని చేసింది కేంద్రం. నవంబర్ 11 నుంచి నవంబర్ 18 వరకు భద్రతా బలగాలు ఇక్కడే విధులు నిర్వహిస్తాయని స్పష్టం చేసింది.
లఖ్నవూ, అలీగఢ్, కాన్పుర్ వంటి 12 సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బలగాలు భద్రత చేపడతాయి. అంతే కాక, దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అన్ని రాష్ట్రాల పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసింది కేంద్రం.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఈలోపు అయోధ్య కేసులో తీర్పు వెలువడే అవకాశముంది.
ఇదీ చూడండి:అయోధ్య కేసు తీర్పు విజయోత్సవాలపై ఆంక్షలు