కేరళ త్రిస్సూర్ జిల్లాలోని వియ్యూరు కేంద్ర కారాగారం అరుదైన ఘనత సాధించింది. దేశంలో తొలిసారి జైలులో ఓ టీవీ ఛానల్ ప్రారంభించారు ఇక్కడి అధికారులు. 'ఫ్రీడమ్ ఛానల్' పేరుతో ప్రారంభమైన ఈ ఛానల్లో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలకు నటులు, దర్శకులు సహా మొత్తం కళాకారులు ఇక్కడి ఖైదీలే కావడం విశేషం.
ప్రస్తుతం జైలులోనే ఈ ఛానల్ ప్రసారమవుతోంది. రాబోయే రోజుల్లో వీరితోనే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ఫ్రీడమ్ ఛానల్లో లఘు చిత్రాలు, కామెడీ షో, మిమిక్రీ, సంగీత విభావరి, నృత్య కార్యక్రమాలు, చిత్రాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి వారం ముందే చిత్రీకరిస్తారు. ఆ వారంలోనే ఎడిటింగ్ పూర్తి చేస్తారు. జైలులో ఏర్పాటు చేసిన టీవీల్లోనే ఇవి ప్రసారమవుతాయి. ఇందులో తెరమీద, తెరవెనుక ఉన్న బృందం మొత్తం జైలు సభ్యులే.
ఇంతకుముందు 'ఫ్రీడమ్ మెలోడీ' పేరుతో ఈ జైలులోనే రేడియోను ప్రారంభించారు. జైలు నుంచి ప్రసారమయ్యే తొలి రేడియోగా ఇది ఘనత సాధించింది. అలానే ఇక్కడ ఇదే పేరుతో ఓ సంగీత బృందమూ ఉంది.
ఓ అధునాతన వంటిల్లు, ఆర్ఓ ప్లాంట్, విద్యుత్ లాండ్రీని టీవీ ఛానల్‌తో పాటు శుక్రవారం ప్రారంభించారు.
ఇదీ చూడండి: కడుపులో చెంచాలు, బ్రష్‌లు, స్క్రూ డ్రైవర్, కత్తి