ETV Bharat / bharat

కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రక్రియపై​ 97 శాతం మంది సంతృప్తి!

కరోనా టీకా తీసుకున్న7.75 లక్షల మంది వ్యక్తులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొవిన్​ యాప్​ ద్వారా సర్వే చేసింది. అందులో 97 శాతం మంది వ్యాక్సినేషన్​ ప్రక్రియపై ​సంతృప్తి వ్యక్తం చేశారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​​ తెలిపారు.

Central govt claims 97% beneficiaries satisfied with vaccination process
కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియపై 97 శాతం మంది సంతృప్తి!
author img

By

Published : Feb 9, 2021, 8:52 PM IST

కరోనా వాక్సిన్​ తీసుకున్న వారిలో 7.75 లక్షలమందిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్వేచేసింది. అందులో 97 శాతం మంది కరోనా వాక్సినేషన్​ ప్రక్రియ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​​ తెలిపారు. ఇంకా వాక్సిన్​ ఇతరేతర విషయాలపై సర్వేలో వెల్లడైన విషయాలు చూద్దాం.

  • 7.75లక్షల మందిలో 97.35 శాతం మంది కరోనా వాక్సిన్​ ప్రక్రియ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
  • వాక్సిన్​ ఇచ్చే ప్రదేశంలో భౌతిక దూరం నిబంధనలు సరిగ్గా అమలయ్యాయని 97.31శాతం మంది పేర్కొన్నారు.
  • టీకా పంపిణీ ప్రక్రియ గురించి తమకు సమాచారం ఇచ్చారని 98.37 శాతం మంది తెలిపారు.
  • వ్యాక్సిన్​ ప్రతికూలతల గురించి తెలియజేశారని 88.76 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • టీకా ఇచ్చాక అర గంట పాటు పర్యవేక్షించారని 97.19 శాతం మంది తెలిపారు.

ఇదీ చూడండి: మరో 1.45 కోట్ల టీకాలకు కేంద్రం ఆర్డర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.