ఆన్‌లైన్ కోర్సుల బోధన కోసం వర్చువల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై కేంద్ర విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, ఉన్నత విద్యారంగంలోని ప్రైవేటు సంస్థలతో త్వరలోనే విస్తృత స్థాయి సంప్రదింపులు జరపనుంది. వర్చువల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు, నిబంధనలపై చర్చించనుంది.
ప్రత్యేకతలు ఇవే..!
వర్చువల్ విశ్వవిద్యాలయాల ద్వారా కోర్సులన్నీ ఆన్‌లైన్‌లోనే బోధిస్తారు. విద్యార్థులు తమకు నచ్చిన విధానంలో పరీక్షలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం ఉన్నత విద్యారంగంలో స్థూల నమోదు నిష్పత్తి ప్రస్తుతం 26శాతం ఉండగా, దాన్ని 2030 నాటికి 50శాతానికి పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వర్చువల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు యోచన చేస్తోంది.
ఇదీ చదవండి : భారత్ సత్తా చాటిన ఏరో ఇండియా ప్రదర్శన