ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వినియోగించేది లేదని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పక్కనబెట్టి, మళ్లీ బ్యాలెట్ పేపర్లను వినియోగించే అవకాశం లేదని తెలిపారు.
"మళ్లీ బ్యాలెట్ యుగానికి వెళ్లబోయేది లేదు. అది గత చరిత్ర అని సుప్రీం కోర్టు చాలా సార్లు స్పష్టం చేసింది."
-సునీల్ అరోడా, సీఈసీ
ఈవీఎంలను తారుమారు చేయడానికి అవకాశం ఉందని కొంత కాలంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం, నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వంటి పార్టీలు ఈవీఎంలను వదిలిపెట్టి, బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.