ETV Bharat / bharat

భారత్​లో కరోనా టీకాపై బుధవారమే క్లారిటీ! - కరోనా వ్యాక్సిన్

కరోనా కోరల నుంచి విముక్తి కోసం యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్‌ అతి త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలంటూ ఇప్పటికే ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై డీసీజీఐ రెండు వారాల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం.

CDSCO expert panel to review COVID vaccine applications on Wednesday
అతి త్వరలోనే అందుబాటులోకి కరోనా టీకా!
author img

By

Published : Dec 8, 2020, 2:32 PM IST

కొవిడ్‌ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు చేసుకున్న విజ్ఞప్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించనుంది. టీకా పనితీరు, పంపిణీ వంటి అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరపుతుంది. ఈ కమిటీ తమ పరిశీలనలను అందించిన తర్వాత రెండు వారాల్లోగా కొవిడ్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు కల్పించే అవకాశాలున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దేశంలో కొద్దివారాల్లోనే కొవిడ్‌ -19 టీకా సిద్ధమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా వార్తలు మరింత ఊరటనిస్తున్నాయి.

భారత్‌లో టీకా వినియోగానికి అనుమతి కోరిన తొలి సంస్థ ఫైజర్‌. ఆ తర్వాత సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు కూడా డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్నాయి. టీకా అవసరంతో పాటు భద్రత కూడా ముఖ్యమైన అంశమని, అందుకే అత్యవసర అనుమతులు ఇచ్చే ముందు వ్యాక్సిన్‌ సామర్థ్యాలు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. టీకా పురోగతిపై భారత ప్రభుత్వం గట్టిగా దృష్టిపెట్టింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే రోజు మూడు నగరాల్లో పర్యటించి వ్యాక్సిన్‌ ప్రయోగాలను పరిశీలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే భారత్‌లో టీకా అత్యవసర వినియోగ అనుమతులకు దరఖాస్తులు రావడం విశేషం.

ఇప్పటికే బ్రిటన్‌లో ఫైజర్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించింది. మంగళవారమే అక్కడ టీకా పంపిణీ ప్రారంభించారు. మన దేశంలో కూడా టీకా అందుబాటులోకి వస్తే తొలి ప్రాధాన్యంగా ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.

ఇదీ చూడండి: 'టీకా పంపిణీకి మొబైల్ సాంకేతికత సాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.