భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్... త్రిదళాల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత గగనతలం భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు 'ఎయిర్ డిఫెన్స్ కమాండ్' ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం జూన్ 30లోగా ఓ ప్రణాళిక తయారుచేయమని అధికారులను ఆదేశించారు.
త్రివిధ దళాల సమన్వయం
త్రివిధ దళాల సమాహారంతో ఓ సైనిక స్థావరం నిర్మించేందుకు కొన్ని ప్రాంతాలను గుర్తించారు. ఇలాంటి రెండు మూడు స్థావరాల మధ్య మంచి సమన్వయంతో... సైనిక వ్యూహాన్ని పక్కాగా చేపట్టేందుకుకు 'లాజిస్టిక్స్ సపోర్ట్ పూల్' ఏర్పాటుచేయాలని సీడీఎస్ భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సైనిక, వాయు, నావికా దళాల మధ్య సమన్వయం సాధించడానికి... ఈ ఏడాది చివరిలోపు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కూడా బిపిన్ రావత్ నిర్ణయించారు.
ఇదీ చూడండి: 'పౌరచట్టంపై కాదు.. పాక్కు వ్యతిరేకంగా నిరసనలు చేయండి'