కర్ణాటకలోని చిక్కబల్లాపుర్ జిల్లా గౌరిబిదనూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో డోర్‌ను ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు.
అసలేం జరిగింది?
రోడ్డు పక్కనే స్కార్పియో వాహనాన్ని ఆపిన ఆ ఎస్యూవీ డ్రైవర్.. వెనక వచ్చే వాహనాలను చూడకుండా కారు డోర్‌ను తెరిచాడు. వెనక నుంచి ఓ ద్విచక్ర వాహనదారుడు వేగంగా దూసుకొచ్చాడు. కారు తలుపును ఢీకొట్టి.. రోడ్డుపై వెళ్తున్న మరో వాహనం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఆ బైకర్. గౌరిబిదనూర్ బీహెచ్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడిని గౌరిబిదనూర్ వాసి నాగరాజ్‌గా గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీకెమెరాల్లో నమోదైన ప్రమాద దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.