ETV Bharat / bharat

సీబీఎస్​ఈ 12వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - CBSE EXAMS

సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం బోర్డు ప్రకటించింది. మొత్తం 1.05 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 59.43శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపింది.

CBSE-EXAM RESULTS -OUT
సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
author img

By

Published : Oct 9, 2020, 10:31 PM IST

కరోనా వేళ పరీక్షలు నిర్వహించిన సీబీఎస్​ఈ బోర్డు.. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం విడుదల చేసిన 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో 59.43శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొంది.

  • పరీక్షకు నమోదు చేసుకున్న వారి సంఖ్య : 1.16 లక్షలు
  • పరీక్షలకు హాజరైన వారి సంఖ్య : 1.05లక్షలు
  • మార్కులు మెరుగుపరచుకోవటానికి పరీక్ష రాసినవారు : 87,849

పై చదువుల కోసం విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకునేందుకే ఫలితాలను తక్కువ సమయంలో ప్రకటించామని బోర్డు సీనియర్​ అధికారి తెలిపారు. అంతకుముందు ఇదే విషయంపై స్పందించిన సుప్రీంకోర్టు "సీబీఎసీ ఫలితాలను వెంటనే ప్రకటించాలి. విద్యార్థులకు కాలేజీల్లో సీటు లభించేలా యూజీసీ తమ అడ్మిషన్ ప్రక్రియను అమలు చేయాలి."అని ఆదేశించింది.

మార్కులు మెరుగుపరచుకోవటానికి 12వతరగతి విద్యార్థులకు అవకాశం ఇచ్చిన సీబీఎస్​ఈ 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.