కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. రాజీవ్ కుమార్‌ను దేశం వదిలి వెళ్లకుండా చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంది సీబీఐ. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు సమాచారం అందించింది. రూ.2,500 కోట్ల శారదా కుంభకోణంలో రాజీవ్ కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు.
మాజీ సీపీని అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతించమని సుప్రీంకోర్టును ఇప్పటికే అభ్యర్థించింది సీబీఐ. సరిపడా ఆధారాలు సమర్పిస్తే పరిశీలిస్తామని సీబీఐకి సూచించింది అత్యున్నత న్యాయస్థానం.
ఇదీ చూడండి: సముద్ర గర్భంలో రయ్రయ్- ఉబెర్ నూతన సేవలు