ETV Bharat / bharat

యాంటీవైరస్ పేరిట మోసం.. 6 సంస్థలపై సీబీఐ కేసు - కంప్యూటర్ లో యాంటీ వైరస్​లు

యాంటీ వైరస్​ పేరిట మాల్​వేర్​ను ఇన్​స్టాల్​ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరు ప్రైవేటు సంస్థలపై కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. పాప్​-అప్​ మెసేజ్ ద్వారా కంప్యూటర్​ను రక్షించుకోవటం కోసం యాంటీ మాల్​వేర్​ను ఇన్​స్టాల్ చేసుకోవాలని ఆయా సంస్థలు సూచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

CBI books 6 firms for installing malware on people's computers
యాంటీవైరస్ పేరిట మోసం-6 సంస్థలపై సీబీఐ కేసు
author img

By

Published : Sep 17, 2020, 10:02 PM IST

సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ మీ కంప్యూటర్ స్క్రీన్‌లో పాప్-అప్ సందేశం హెచ్చరిస్తోందా? మరి మీరు దాన్ని ఓపెన్​ చేస్తే కేటుగాళ్ల ఉచ్చులో పడినట్లే..! ఇదే తరహాలో పాప్​-అప్​ మెసేజ్​ల ద్వారా కంప్యూటర్​లో యాంటీ వైరస్​ పేరిట మాల్​వేర్​ను ఇన్​స్టాల్​ చేస్తున్నట్లు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరు ప్రైవేటు సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఈ జాబితాలో దిల్లీకి చెందిన సాఫ్ట్​విల్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సాబురి టీఎల్‌సీ వరల్డ్‌వైడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, జైపుర్‌కు చెందిన ఇన్నోవానా థింక్‌లాబ్స్ లిమిటెడ్, సిస్ట్‌వీక్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే నోయిడాకు చెందిన బెనోవెలియంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, నోయిడా, గురుగ్రామ్ ఆధారిత సబూరి గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి. వాటిల్లో సీబీఐ బృందాలు గురువారం సోదాలు నిర్వహించాయి. జైపుర్, దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, మెయిన్‌పురిలోని 10 చోట్ల ఏకకాలంలో ఏజెన్సీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఈ కంపెనీలు వినియోగదారుల వ్యక్తిగత కంప్యూటర్లలో పాప్-అప్ సందేశాలను పంపి.. భద్రతా సమస్యలు, మైక్రోసాఫ్ట్ విండోస్ సిస్టమ్‌లో మాల్​వేర్ ఉనికి ఉన్నట్లు తప్పుడు హెచ్చరికలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా వచ్చిన సందేశాల్లో కంపెనీకి చెందిన ఫోన్​ నెంబర్​ ఉంటుందని.. ఈ నెంబర్​కు కాల్​ చేసినప్పుడు కంపెనీ ఉద్యోగులు యాంటీ మాల్​వేర్లు, యాంటీ వైరస్​ యాప్​ను ఇన్​స్టాల్ చేసుకోవాలని సూచిస్తారని వెల్లడించారు. అవి కచ్చితంగా మాల్​వేర్​కు చెందిన ప్రోగామ్స్​ (పీయూపీ) అని పేర్కొన్నారు.

"బాధితులను ఆన్‌లైన్‌లో నగదు చెల్లించటం, లేదా ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్‌లో పేర్కొన్న నంబర్‌కు కాల్ చేయడం ద్వారా పీయూపీలను యాక్టివేట్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఈ పద్ధతులను అనుసరించటం ద్వారా వినియోగదారులు మోసపోతున్నారు. కంపూటర్​ నుంచి రక్షించుకోవటం కోసం వినియోగదారులు వారి ఉచ్చులో పడుతున్నారు" అని సీబీఐ ప్రతినిధి ఆర్​కే గౌర్ అన్నారు.

కంప్యూటర్​లోని సమస్యల పరిష్కారం కోసం ఆన్​లైన్​ లింక్​ ద్వారా చెల్లింపులు చేయాలని.. సపోర్ట్ సిస్టమ్ కాల్​ సెంటర్​ పేరిట బాధితులను అడుగుతున్నారని అధికారులు తెలిపారు. ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని యూజర్లకు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.