ETV Bharat / bharat

కరోనా 'ఫేక్​' కిట్ల దందాపై సీబీఐ హెచ్చరికలు

కొవిడ్​-19 టెస్టింగ్​ కిట్లపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలను అప్రమత్తం చేసింది సీబీఐ. అంతర్జాతీయ మార్కెట్లో తప్పుడు టెస్టింగ్​ కిట్లు చలామణి అవుతున్నాయన్న ఇంటర్​పోల్​ అధికారుల సమాచారంతో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

CBI alerts state police about fake COVID-19 kits in international market
'ఫేక్​' కిట్లపై రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసిన సీబీఐ
author img

By

Published : May 5, 2020, 4:27 PM IST

అంతర్జాతీయ మార్కెట్లో చలామణి అవుతున్న నకిలీ కొవిడ్​-19 టెస్టింగ్ కిట్లపై రాష్ట్రాల పోలీసు విభాగాలను అప్రమత్తం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). అంతర్జాతీయ క్రిమినల్​ పోలీసు ఆర్గనైజేషన్​ (ఇంటర్​పోల్​) సమాచారం మేరకు పలు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ జాబితాలో భారత్​కు చెందిన ఏ సంస్థగానీ, సరఫరాదారుగానీ లేరని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు విముఖత వ్యక్తం చేశాయి. ఈ వివరాలు బహిర్గతం చేస్తే.. ప్రస్తుతం పోలీసుల నిఘాలో ఉన్న సంస్థలు అప్రమత్తమయ్యే అవకాశాలున్నాయని వివరించారు ఆ అధికారులు. తప్పుడు టెస్టింగ్​ కిట్లపై మొత్తం 194 దేశాలను ఇంటర్​పోల్​ అధికారులు అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడిన తర్వాత ఇంటర్​పోల్​ అధికారులు అంతర్జాతీయ నేరాలను పెద్ద సంఖ్యలో గుర్తించారు. ఆన్‌లైన్​లో అమ్ముడవుతున్న నకిలీ ఔషధాలు, వైద్య పరికాలతో పాటు ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఆర్థిక మోసాలు ఎక్కువగా సాగుతున్నట్లు పసిగట్టారు.

ఇదీ చూడండి : కిమ్ జోంగ్​కు రష్యా 'స్మారక యుద్ధ పతకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.