కెనడాకు చెందిన యువతి.. భారత యువకుడిని పరిణయమాడింది. ఈ జంట తమిళనాడు కొడైకెనాల్లోని మరియమ్మన్ ఆలయంలో కుటుంబ సమక్షంలో ఒక్కటయ్యారు.
ఫేస్బుక్ కలిపింది...
'జాస్పిన్' కెనడాకు చెందిన యువతి (సంక్షిప్త కథా రచయిత్రి) తమిళనాడు దిండిగల్ జిల్లాలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. వైభవ్... మహారాష్ట్ర నాగపుర్ జిల్లాకు చెందిన నివాసి. వీరిద్దరూ.. సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. చాటింగ్‌తో మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
పెళ్లికి హాజరైన బంధుమిత్రులు.. నూతన జంటను ఆసక్తిగా తిలకించారు. జీవితాంతం ఇరువురూ కలిసి సుఖంగా ఉండాలని దీవించారు.
ఇదీ చూడండి : 40వేల కిమీ.. 1500 అమర జవాన్ల కుటుంబాలు.. ఓ బాలుడు