ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతపై నూతన కేబినెట్ కమిటీ ఏర్పాటైంది. అత్యంత కీలకమైన ఈ ప్యానెల్... జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ప్రధాని అధ్యక్షుడుగా ఉన్న ఈ కమిటీలో రక్షణ,హోం,ఆర్థిక,విదేశీ వ్యవహారాల మంత్రులు సభ్యులుగా ఉంటారు.
ప్రస్తుత కేబినెట్ కమిటీకి ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్షా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ కమిటీలో సభ్యులు.
నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు, లేదా కేబినెట్ పునర్ వ్యవస్థీకరించినపుడు... భద్రతపై ఈ కేబినెట్ కమిటీ మారుతుంది.
ఇదీ చూడండి: కాస్త చోటు కోసం చిరుతల ఆధిపత్య పోరాటం