ETV Bharat / bharat

'ఆ​ నిర్ణయంతో గ్రామీణ భారతానికి సానుకుల ఫలితాలు' - Cabinet decisions

వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్ర మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయం.. గ్రామీణ భారతంపై సానుకూల ఫలితాల్ని ఇస్తుందన్నారు ప్రధాని మోదీ. ఈ సంస్కరణలు రైతులకు ప్రయోజనం చేకురుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Cabinet decisions on agrarian reforms will have very positive impact on rural India: PM
కేంద్ర కేబినెట్​ నిర్ణయంపై మోదీ సానుకూల స్పందన
author img

By

Published : Jun 3, 2020, 8:36 PM IST

వ్యయసాయ ఉత్పత్తులపై కేంద్ర కేబినెట్​ తీసుకున్న నిర్ణయం.. గ్రామీణ భారతానికి సానుకూల ఫలితాన్నిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. రైతులు పండించిన పంటల కొనుగోలు, అమ్మకాలపై ఉన్న ఆంక్షలను కేంద్రం తొలగించి.. దశాబ్దాలుగా ఉన్న రైతుల డిమాండ్​లను నెరవేర్చిందని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

సుదీర్ఘ కాలంగా పెండింగ్​లో ఉన్న సమస్యలకు వ్యవసాయ సంస్కరణలు దోహదపడతాయని ప్రధాని చెప్పుకొచ్చారు. వ్యవసాయ ఉత్పత్తి, వాణిజ్య రంగాలకు విస్తృత మార్కెట్​ కల్పించే దిశగా "ఒకే దేశం-ఒకే మార్కెట్"​ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మార్గం మరింత సుగమం అవుతుందన్నారు.

Cabinet decisions on agrarian reforms will have very positive impact on rural India: PM
కేంద్ర కేబినెట్​ నిర్ణయంపై మోదీ సానుకూల స్పందన

సాంకేతికత సహాయంతో సమస్యలను పరిష్కరించే యంత్రాంగాన్ని నెలకొల్పేవిగా ఈ నిబంధనలు ఉన్నాయంటూ మోదీ కితాబిచ్చారు. రైతు సాధికారత-రక్షణలు, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరపై ఆర్డినెన్స్​కు ఆమోదముద్ర వేసింది కేబినెట్​. దీనితో రైతలు తమ ప్రయోజనాలను భద్రంగా ఉంచుకోవచ్చని తెలిపారు మోదీ.

ఇదీ చదవండి: రైతుల కోసం ఇక 'ఒకే దేశం- ఒకే మార్కెట్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.