పౌరసత్వ చట్టంపై స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రధాన సమస్యల నుంచి ఎన్డీఏ ప్రజల దృష్టి మరల్చుతోందని ఆరోపించారు.
"ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఏఏ, ఎన్ఆర్సీలను పావులుగా వాడుకుంటున్నారు. మైనారిటీలే కాదు.. ఐక్యత, అభివృద్ధి కోరుకునే వారూ ఎన్ఆర్సీ, సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త చట్టం మత, సామాజిక ఐక్యత, సామరస్యాన్ని దెబ్బతీస్తుంది."
-శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
సీఏఏ ద్వారా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌కు చెందిన వారికే అవకాశం ఇవ్వటం ఏమిటనీ.. శ్రీలంక తమిళులు ఏం చేశారని పవార్ ప్రశ్నించారు. బిహార్‌తో సహా 8 రాష్ట్రాలు ఈ బిల్లును అమలు చేసేందుకు నిరాకరించాయని... మహారాష్ట్రలోనూ అమలు కానివ్వమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'పౌరసత్వం పేరుతో భారతీయులను వేధించం'