ETV Bharat / bharat

వుహాన్​లోని భారతీయుల కోసం మిలిటరీ విమానం

author img

By

Published : Feb 19, 2020, 5:37 AM IST

Updated : Mar 1, 2020, 7:22 PM IST

చైనాలోని వుహాన్​ నగరానికి మరోసారి విమానాన్ని పంపి మరికొంత మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో చైనాకు సహాయంగా ఔషధాలు, ఇతర వైద్య పరికరాలను తీసుకువెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నెల 20న భారత్​ నుంచి చైనాకు సీ-17 మిలిటరీ విమానం బయలుదేరనున్నట్లు సమాచారం.

c 17 aircraft to evacuate more indians from wuhan
వుహాన్​కు భారత్ మరో విమానం

కరోనాకు ప్రధాన కేంద్రమైన చైనాలోని వుహాన్​ నగరంలో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం మరో సారి సహాయక చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం ఈ నెల 20న సీ-17 మిలిటరీ విమానాన్ని వుహాన్​కు పంపించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

భారతీయులను స్వదేశానికి తీసుకురావడం సహా.. చైనాకు సహాయంగా ఈ విమానంలో పలు ఔషధాలు, వైద్య పరికరాలను పంపించనున్నట్లు మిలిటరీ అధికారులు తెలిపారు.

ఇదివరకే ఎయిర్​ ఇండియా విమానాలను చైనాకు పంపి మొత్తం 640 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత చైనాకు ఔషధాలు, ఇతర వైద్య పరికరాలను పంపించనున్నట్లు గత వారం ప్రకటించింది.

కరోనాను ఎదుర్కొనేందుకు చైనాకు అండగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ దేశ రాయబారి సన్​ వేయ్​డంగ్ భారత్​కు అభినందనలు తెలిపారు. హుబే ప్రావిన్సులో ఉన్న భారతీయులెవ్వరికీ కరోనా సోకలేదని.. అక్కడి అధికారులు వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:ఆపరేషన్​ కరోనా: ఐటీబీపీ శిబిరం నుంచి ఇళ్లకు 302 మంది

Last Updated : Mar 1, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.