ETV Bharat / bharat

ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు-లారీ​ ఢీ.. 20కి చేరిన మృతులు - kerala bus accident

Tamilnadu Bus Accident
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
author img

By

Published : Feb 20, 2020, 7:38 AM IST

Updated : Mar 1, 2020, 10:13 PM IST

08:17 February 20

20కి చేరిన మృతులు

తమిళనాడు తిరుప్పూర్​లో​ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. మరికొందరు క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

08:03 February 20

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం...16 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడు తిరుప్పూర్​ జిల్లా అవినాషిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళ రాష్ట్ర లగ్జరీ బస్సు, ఓ కంటైనర్​ లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అవినాషి నగర పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను తిరుప్పూర్​, కోయంబత్తూర్​ ఆస్పత్రులకు తరలించారు.

కేరళకు చెందిన లగ్జరీ బస్సు తిరుప్పూర్​లోని సలీమ్​ నగరం నుంచి తిరువనంతపురం వెళుతున్న క్రమంలో ఎదురగా వస్తున్న కంటైనర్​ లారీతో ఢీకొట్టింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వెలుతురులేమి కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.   

07:33 February 20

ఆర్టీసీ బస్సు-కంటైనర్​ లారీ ఢీ.. 16 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కేరళకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ కంటైనర్‌ లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. మరో 31 మందికి గాయాలయ్యాయి.

Last Updated : Mar 1, 2020, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.