కేంద్ర ప్రభుత్వ 'ప్రజావ్యతిరేక' విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. బంగాల్లో ఆందోళనలు మిన్నంటాయి. రైల్‌రోకో నిర్వహించారు ఆందోళనకారులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండాలు పట్టుకొని రైల్వే ట్రాక్‌పై నినాదాలు చేశారు. ఫలితంగా రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ముంబయిలో నిరసనలను తెలుపుతూ రోడ్లపై టైర్లకు నిప్పంటించారు. బంద్ కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఎందుకీ బంద్?
ఈనెల 2వ తేదీన జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మికశాఖ విఫలమైందని, అందుకే ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న అఖిల భారత సమ్మెకు పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.