How to Choose the Right Bra : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో చాలా మంది అమ్మాయిలు బ్యాక్‌లెస్, షోల్డర్ ఫ్రీ, టైట్‌ఫిట్ కోట్లు, సూట్స్, లైట్‌వెయిట్ వంటి రకరకాల దుస్తుల్ని ఇష్టపడుతున్నారు. పార్టీలకు, ఫంక్షన్లకు ఎక్కడికి వెళ్లినా సర్దుకునే ఇబ్బంది లేకుండా.. శరీరాన్ని పట్టి ఉంటాయని, అలాగే ట్రెండింగ్ లుక్‌గా కనిపిస్తామని వీటిని ఎంపిక చేసుకుంటున్నారు. కానీ.. ఆయా దుస్తులకు సరిపోయే బ్రాలను ఎంపిక చేసుకోవడంలో మాత్రం వెనకబడుతున్నారు. దీనివల్ల ఆ దుస్తులు వేసుకున్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సరైన బ్రాలు సెలెక్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ రకమైన వస్త్రాలకు ఆ రకమైన బ్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
టీ షర్ట్ బ్రాలు :
పెండ్లి, శుభకార్యాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో చాలా మంది అమ్మాయిలు చీరలు ధరిస్తుంటారు. ఇలా పండగ ఏదైనా చీరకట్టులో అమ్మాయిలు మరింత అందంగా కనిపిస్తారు. అయితే, ఇలాంటి సందర్భాల్లో చీర కట్టుకున్నప్పుడు టీ షర్ట్ బ్రాలు సౌకర్యంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి బ్రాలు ఎలాంటి చీరలకైనా నప్పుతాయి. అదే విధంగా డ్రెస్సులకు కూడా టీ షర్ట్ బ్రాలు సౌకర్యంగా ఉంటాయి. వీటి మృదువైన ప్యాడింగ్ శరీరాన్ని పట్టి ఉంచి చక్కని ఆకృతిని ఇస్తాయి. టీ షర్ట్ బ్రాలకు అనవసరమైన బ్రాలైన్లూ ఉండవు.
బాల్కోనెట్ బ్రాలు :
బ్రాడ్, స్క్వేర్ నెక్‌లు ఉన్న డ్రెస్సులు, బ్లౌజ్‌లు వేసుకునేటప్పుడు నార్మల్ లోదుస్తులు వేసుకుంటే స్ట్రాప్స్, లైన్స్ బయటికి కనపడుతుంటాయి. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి దుస్తులు ధరించినప్పుడు బాల్కోనెట్ బ్రాలు సౌకర్యంగా ఉంటాయి. వీటి కప్పులు అవసరమైన కవరేజీని మాత్రమే ఇచ్చి డ్రెస్సుల అందాన్ని, మన సౌకర్యాన్నీ పోనీవు.
- పార్టీలకు వెళ్లాల్సినప్పుడు ట్రెండింగ్‌గా కనిపించడానికి.. బ్యాక్‌లెస్‌లు, షోల్డర్ ఫ్రీ అవుట్‌ఫిట్స్ వేసుకుంటారు చాలా మంది. ఇలాంటప్పుడు ఆఫ్ షోల్డర్ లేదా స్ట్రాప్‌లెస్ బ్రాలు వేసుకుంటే స్ట్రాప్స్ బయటకు కనిపిస్తాయన్న ఆందోళన ఉండదు. వీటిలో ఉండే సిలికాన్ టేపింగ్ చర్మాన్ని పట్టి ఉంచి దుస్తులకు చక్కటి లుక్‌ని ఇస్తాయి.
- వి షేప్, ఆలియా కట్ లాంటి డీప్‌నెక్ డ్రెస్సులు, బ్లౌజ్‌లు ధరించేటప్పుడు ప్లంజ్‌బ్రాలను వేసుకుంటే మంచిది.
- వ్యాయామం చేసేటప్పుడు స్పోర్ట్స్ బ్రాలు సౌకర్యంగా ఉంటాయి. ఇవి చెమటను పీల్చుకుని, ఎక్సర్‌సైజులు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.
- ఫంకీ ట్యాంక్ టాప్‌లు, వై స్టైల్, క్రాస్ ఓవర్ టాప్‌లు ఇష్టపడే వారికి రేసర్ బ్రాలు బెస్ట్ ఆప్షన్. వీటివల్ల పట్టీ జారడం, బ్రా కనిపించడం వంటి ఇబ్బందులు ఉండవు.
- లేతరంగు వస్త్రాలు వేసుకున్నప్పుడు వాటికి సరిపోలే బ్రాలను వేసుకుంటుంటాం. కానీ కొన్నిసార్లు ఈ ప్రయత్నం తిప్పికొడుతుంది. ఉదాహరణకు తెలుపు రంగు దుస్తులు వేసుకునేటప్పుడు లోదుస్తులు కూడా తెల్లవే వేస్తుంటాం. అవి లుక్‌ని పాడుచేసి కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. దాంతో చాలా ఇబ్బంది పడుతుంటాం. అలాంటప్పుడు న్యూడ్ రకాలను వేసుకుంటే సరిపోతుంది.
ఇవి కూడా చదవండి :
'బ్రా’ వేసుకోవడం మంచిదా..? కాదా..? ఈ స్టోరీ చదవండి..
అలర్ట్: బ్రా ధరిస్తే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? - నిపుణుల సమాధానమిదే!