ETV Bharat / bharat

'బుల్లెట్​ ట్రైన్ కాంట్రాక్టులు 72 శాతం దేశీయ సంస్థలకే' - దేశీయ కంపెనీలకు ఊతం

ముంబయి-అహ్మదాబాద్​ మధ్య చేపట్టిన బుల్లెట్​ ట్రైన్​ ప్రాజెక్ట్ ఒప్పందాల్లో 72 శాతం కాంట్రాక్టులు దేశీయ సంస్థలతోనే కుదుర్చుకున్నట్లు రైల్వే బోర్టు ఛైర్మన్ వీకే యాదవ్ స్పష్టం చేశారు. అసోసియేట్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫ్ ఇండియా నిర్వహించిన వెబినార్‌లో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

VK Yadav
'72 శాతం కాంట్రాక్టులు దేశీయ సంస్థలతోనే'
author img

By

Published : Nov 28, 2020, 6:10 AM IST

ముంబయి-అహ్మదాబాద్‌ ప్రాంతాల మధ్య చేపట్టిన బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ ఒప్పందాల్లో 72 శాతం కాంట్రాక్టులు దేశీయ సంస్థలతో కుదుర్చుకున్నట్లు రైల్వే బోర్డ్‌ ఛైర్మన్‌ వీకే యాదవ్‌ వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా... దేశీయ కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ‌

ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన వంతెనల నిర్మాణం, సొరంగాల తవ్వకం వంటి పనులను దేశీయ గుత్తేదార్లు నిర్వహించనున్నట్లు వీకే యాదవ్​ చెప్పారు. సిగ్నలింగ్‌, టెలికాం, రోలింగ్‌ స్టాక్‌ పనులు జపాన్‌కి చెందిన సంస్థలు చేస్తాయని అసోసియేట్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫ్ ఇండియా నిర్వహించిన వెబినార్‌లో ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'ఇకపై ఆ హెల్మెట్​లు మాత్రమే వాడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.