ETV Bharat / bharat

బావను కిరాతకంగా పొడిచి చంపిన బావమరిది

చెల్లెలి ఆత్మహత్యకు కారణమయ్యాడని బావను అతి కిరాతకంగా హత్య చేశాడు బావమరిది. స్నేహితుడితో కలిసి నడిరోడ్డుపైనే కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడు. ఇద్దరు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

Brother killed his sister husband in Bangalore-VIDEO
నడిరోడ్డు మీద బావను కిరాతకంగా హత్య చేసిన బావమరిది
author img

By

Published : Oct 12, 2020, 11:55 AM IST

స్నేహితుడితో కలిసి బావను నడిరోడ్డుపైనే కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఓ బావమరిది. తన చెల్లి ఆత్మహత్యకు కారణమయ్యాడనే కక్షతో ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. కర్ణాటక బెంగళూరులో సెప్టెంబరు 21న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

నడిరోడ్డు మీద బావను కిరాతకంగా హత్య చేసిన బావమరిది

ఏం జరిగింది?

జాన్​​పాల్ సోదరి జాస్మిన్​ కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. 7 సంవత్సరాల క్రితమే ఆమెకు రాజేష్​తో వివాహం జరిగింది. భర్త, అత్తమామల వేధింపులు తాళలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు చనిపోయే ముందు జాన్​పాల్​కు ఫోన్​ చేసి చెప్పింది జాస్మిన్​.

తన చెల్లి మరణానికి బావ రాజేషే కారణమని జాన్​ కక్ష పెంచుకున్నాడు. అతడిని అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు. స్నేహితుడు దినేశ్​తో కలిసి అదును చూసి సెప్టెంబర్​ 21న బావను దారుణంగా హత్య చేశాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.