ETV Bharat / bharat

'టీఆర్​పీ రేటింగ్స్​ తాత్కాలికంగా బంద్'

author img

By

Published : Oct 15, 2020, 1:46 PM IST

Updated : Oct 15, 2020, 4:26 PM IST

'టీఆర్​పీ'​ కుంభకోణం బయటపడిన వేళ రేటింగ్స్ ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్​).

Broadcast Audience Research Council (BARC) temporarily suspends news channels' ratings following fake TRP scam
టీఆర్​పీ రేటింగ్​ తాత్కాలికంగా రద్దు: బార్క్​

టీఆర్‌పీల విషయంలో కొన్ని ఛానళ్లు చేసిన మోసాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ మధ్య కాలంలో ఈ కుంభకోణాలపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో వార్తా సంస్థల రేటింగ్​లు​ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ అయిన బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్​) వెల్లడించింది. ఈ నిర్ణయం హిందీ, ప్రాంతీయ, ఆంగ్ల, బిజినెస్ న్యూస్ ఛానళ్లపై ప్రభావం చూపనుంది.

రేటింగ్​ గణాంకాలను మెరుగుపరచడానికి ప్రస్తుత ప్రమాణాలను సమీక్షించి, వాటిలో మార్పులు చేర్పులు చేయాలని బార్క్​ భావిస్తోంది. ఈ క్రమంలో వీక్లీ రేటింగ్​ల‌ లెక్కింపును 12 వారాల వరకు నిలిపేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.

ఫేక్‌ రేటింగ్​ పాయింట్స్‌పై బార్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు ఛానెళ్లపై దృష్టి పెట్టగా.. ఇటీవల మోసాలు వెలుగు చూసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.

ఎన్​బీఏ ప్రశంసలు

బార్క్​ నిర్ణయాన్ని స్వాగతించింది న్యూస్​ బ్రాడ్​కాస్టర్స్​ అసోసియేషన్​(ఎన్​బీఏ). భారత​ ప్రేక్షకులు ఏమి చూస్తున్నారన్న కచ్చితమైన సమాచారాన్ని సేకరించి.. ప్రజల్లో వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలని కోరింది.

హైకోర్టుకే వెళ్లండి..

ఎక్కువ రేటింగ్​లు పొందేందుకు కొన్ని ఛానళ్లకు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ముంబయి పోలీసుల ప్రకటనతో... టీఆర్​పీ కుంభకోణం బయటపడింది. ఈ వ్యవహారంపై నమోదు చేసిన కేసును తప్పుబడుతూ రిపబ్లిక్ టీవీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే బొంబాయి హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ గురువారం వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి: టీఆర్​పీ స్కామ్​ బట్టబయలు- 3 ఛానళ్లపై కేసులు

Last Updated : Oct 15, 2020, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.