బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాద నిర్మూలన అంశంపై చర్చ జరపాలని నిర్ణయించాయి సభ్య దేశాలు. బ్రెజిల్‌లోని కురితిబాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు.
ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశీ వ్యవహారాల కార్యదర్శి టీఎస్ త్రిమూర్తి హాజరయ్యారు.
బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ అమెరికా సభ్య దేశాలు. సభ్య దేశాలకు బ్రెజిల్ సారథ్యం వహిస్తోంది.
" ఉగ్రవాద నిర్మూలనను బ్రిక్స్ సదస్సులో చర్చించబోయే ప్రధాన అంశంగా చేర్చాలని బ్రెజిల్ ప్రతిపాదించింది. దీనికి భారత్ పూర్తి మద్దతు తెలిపింది. సభ్య దేశాలన్నీ ఉగ్రవాదంపై కఠిన చర్యలకు పరస్పర సహకారం అందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. "
-భారత విదేశీ వ్యవహారాల శాఖ
ఈ అంశంతో పాటు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, సంప్రదాయ ఔషధరంగాల్లో సభ్య దేశాల పరస్పర సహకారంపై చర్చ జరుగుతుందని అధికారులు తెలిపారు.