ETV Bharat / bharat

ఎన్నికల రింగ్​లో విజేందర్​ పొలిటికల్​ పంచ్​

author img

By

Published : May 3, 2019, 7:02 AM IST

Updated : May 3, 2019, 8:03 AM IST

కాంగ్రెస్​ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు బాక్సర్​ విజేందర్​ సింగ్. ఎన్నికల వేళ కాంగ్రెస్​లో చేరి దక్షిణ దిల్లీ నుంచి బరిలోకి దిగిన ఆయన​తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి మీకోసం...

విజేందర్ సింగ్

ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులకు క్రేజే వేరు. భారత్​లో అయితే కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. మైదానంలో అభిమానుల మనసును దోచుకుని, అదే ఆత్మవిశ్వాసంతో రాజకీయ రణరంగంలో దిగుతున్నారు క్రీడాకారులు.

దేశంలో ఎన్నికల వేళ కాంగ్రెస్​లో చేరిన బాక్సర్​ విజేందర్​ సింగ్​.. దక్షిణ దిల్లీ నుంచి బరిలోకి దిగారు. ఆయనను పలకరించిన ఈటీవీ భారత్​తో అనేక విషయాలు పంచుకున్నారు విజేందర్.

విజేందర్​ సింగ్​తో ముఖాముఖి

భారత్​, పాకిస్థాన్​లో క్రీడాకారులు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు. మీ రాజకీయ జీవితంలో లక్ష్యాలేమిటి?

పాకిస్థాన్​లో ఇమ్రాన్​ఖాన్​ ప్రధానమంత్రి కావటం గొప్పవిషయం. దేశమేదైనా క్రీడాకారులూ రాజకీయాల్లోకి రావాలి. దేశం గర్వపడేలా చేయాలి.

మీరు భారత్​లో పుట్టారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అలా చూసుకున్నప్పుడు మన దేశం ఎంతమేరకు విజయం సాధించింది?

మేం పైపైకి ఎదుగుతున్నాం. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నీళ్లు, విద్యుత్​ విషయంలో ప్రజలు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మనం అంగారకుడి గురించి మాట్లాడుతున్నాం. మరోవైపు ప్రజలకు నీళ్లు కూడా దొరకటం లేదు. ఇలా రెండు సమాజాల మధ్య అంతరం ఉండటం చింతించాల్సిన విషయం.

శ్రీలంక తరహాలో మన దేశంలో ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. బలహీనమైన ప్రభుత్వం ఉంటే వారిని అడ్డుకోవటం సాధ్యం కాదంటున్నారు. ఉగ్రవాద భయాన్ని ప్రజలపై మోదీ రుద్దుతున్నారని మీరు భావిస్తారా?

ఇలా చేయకూడదు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు భయాన్ని సృష్టిస్తాయి. అభివృద్ధి గురించి మాట్లాడండి. విద్య, ప్రగతి, యువకుల గురించి మాట్లాడండి. ఇంత పెద్ద వ్యక్తులు ఈ సమస్యలను సృష్టించటం సరైన పద్ధతి కాదు.

రాజకీయ నాయకుడిగా దిల్లీలో ఏ సమస్యల గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు?

నిరుద్యోగం ఇంతలా పెరిగిపోతోంది. యువత ఆందోళనలో ఉన్నారు. అది చేస్తాం, ఇది చేస్తాం.. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే 25 ఏళ్లలో ఎన్నడూ ఈ స్థాయి నిరుద్యోగ సమస్య లేదు. ఇది మాత్రం వార్తల్లో కనిపించదు. మతపరమైన సమస్యలు, జాతీయవాదంతో నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది సరికాదు.

మీరు పోటీ చేస్తున్న స్థానంలో ప్రజల మధ్య అంతరాలు ఎక్కువ. ఓ వైపు సంపన్నులు మరోవైపు పేదప్రజలు ఉన్నారు.

నిజంగా ఇది పెద్ద సవాల్​. సులభమైన విషయమేమీ కాదు. కానీ కచ్చితంగా సాధిస్తా. నేను రెండు రకాల జీవితం అనుభవించాను. మా తండ్రి ఓ డ్రైవర్​. 15 రూపాయలకు అమ్మ బట్టలు కుడుతుండేది. గ్రామంలో బతికాను. సంపన్నుల మధ్య నివసించాను.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​కు చాలా సమస్యలు ఉన్నాయి. మళ్లీ ఓటర్లను హస్తం ఆకర్షించగలదా?

ఇప్పుడు కాంగ్రెస్​ను ప్రజలు నమ్ముతున్నారు. రాహుల్​, ప్రియాంక బృందాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. మేమంతా కలిసి భారత్​లో మరోసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తున్నాం.

ఇదీ చూడండి: ఎందరికో స్ఫూర్తి: గోమతి మరిముత్తు గాథ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Doha, Qatar. 2nd May 2019.
1. 00:00 Diamond League news conference with IAAF President Sebastian Coe, Dina Asher-Smith and others
2. 00:04 Lord Coe addressing media
3. 00:07 Cutaway
4. 00:13 SOUNDBITE (English): Sebastian Coe, IAAF President:
Q: "Seb, we'd be interested... in your response to the CAS ruling on Wednesday? A ruling which found in favour of the IAAF."
"I think this is pretty straightforward, and it's very straightforward for any international federation in sport. Athletics has two classifications: it has age; it has gender. We are fiercely protective about both and I'm really grateful, that the Court of Arbitration has upheld that principle."
5. 00:49 SOUNDBITE (English): Sebastian Coe, IAAF President:
Q: "CAS raised issues about the evidence provided for the 1,500 metres and the mile. Would you consider delaying the ruling, or the implementation (of the IAAF's plans to restrict testosterone levels in female runners) as regards to those particular events?
"No."
Q: "What about those that say that, we don't have any rules for people with big lungs, long arms, and why are we picking on this particular natural gift? Don't elite athletes all have special gifts?"
"Look, this is a Diamond League press conference. That's as much as I feel I really need to say, on this subject. Thanks."
6. 01:26 SOUNDBITE (English): Dina Asher-Smith, British sprinter:
Q: "The second question (for Asher-Smith) is about the CAS decision yesterday. What's your opinion about it as a woman and top athlete?"
"Firstly, I don't want to be quoted on the CAS decision, because I'm not a lawyer, I'm not Caster herself and I'm obviously not in that department. So I don't feel like I have an informed opinion on it. But, Caster's my friend, so I hope she's going to be OK."
7. 01:49 Cutaway
SOURCE: SNTV
DURATION: 01:51
STORYLINE:
IAAF President Sebastian Coe told media in Doha, Qatar on Thursday that he is "grateful", after CAS (The Court for Arbitration in Sport) rejected Caster Semenya's appeal against the governing body's decision to restrict testosterone levels in female runners.
The new rules, which apply to women in track events from 400 metres up to the mile, require athletes to keep their testosterone levels below a prescribed level for six months prior to competition.
Lord Coe told media: "Athletics has two classifications: it has age; it has gender. We are fiercely protective about both."
The former middle-distance runner also said there would be no delay in the implementation of the IAAF's new rules.
However, South African Semenya is still eligible to compete in the opening round of the 2019 Diamond League season in Doha on Friday.
Last Updated : May 3, 2019, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.