ETV Bharat / bharat

'చైనా తీరు మార్చుకుంటేనే సరిహద్దులో శాంతి' - External Affairs Ministry Spokesperson Anurag Srivastava

తూర్పు లద్దాఖ్​లోని కీలక ఘర్షణ ప్రాంతాల నుంచి సత్వరమే బలగాలను ఉపసంహరించుకుని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా కృషి చేయాలని సూచించింది భారత్​. ఘర్షణల తీవ్రతను పెంచే చర్యలకు దిగకుండా.. సమస్య సద్దుమణిగేలా ఇరువైపులా దృష్టి సారించాలని పేర్కొంది.

Border standoff
'సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనా కృషి చేయాలి'
author img

By

Published : Sep 17, 2020, 7:38 PM IST

పాంగాంగ్​ సరస్సు సహా కీలక ఘర్షణ ప్రాంతాల నుంచి సత్వరమే బలగాలను ఉపసంహరించుకునేలా చైనా కృషి చేయాలని సూచించింది భారత్​. తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది.

వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ)ని చైనా గౌరవిస్తుందనే నమ్మకం ఉందన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ. ఈ సందర్భంగా రష్యా వేదికగా ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల భేటీల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని ప్రస్తావించారు.

" ఇరుదేశాల మంత్రుల సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. ఎల్​ఏసీ వెంబడి ఘర్షణ ప్రాంతాల నుంచి సత్వరమే పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణ చేపట్టాలి. పరిస్థితుల్లో తీవ్రతను పెంచే విధంగా ఎలాంటి చర్యలకు పోకుండా.. ఘర్షణ ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకే ఇరువైలా దృష్టిసారించాలి. ఇందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్​ను కచ్చితంగా పాటించటం అవసరం. యథాతథ స్థితిని మార్చేందుకు ఎలాంటి ఏకపక్ష చర్యలు తీసుకోకూడదు. "

- అనురాగ్​ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: కొద్ది గంటల్లోనే వ్యూహం మార్చిన చైనా- ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.