ETV Bharat / bharat

'ఒప్పందాలను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి'

భారత్​-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గలేదు. తూర్పు లద్దాఖ్​లో ఘర్షణ వాతావరణం నెలకొనడానికి భారతదేశమే కారణమని చైనా ఇటీవల ఆరోపించడాన్ని భారత్​ తీవ్రంగా ఖండించింది. ఒప్పందాలను మాటల్లో కాకుండా చేతల్లో పాటించి చూపాలని చైనాకు చురకలంటించింది.

India
'ఒప్పందాలను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి'
author img

By

Published : Dec 12, 2020, 5:41 AM IST

తూర్పు లద్దాఖ్​లో ప్రతిష్టంభనకు చైనా దుందుడుకు చర్యలే కారణమని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్​ స్పష్టం చేసింది.

సరిహద్దు ఉద్రిక్తతలకు కారణం భారత్​ తీరేనని ఇటీవల చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ.

ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను తాము గౌరవిస్తున్నట్లు చైనా మాటల్లో చెప్పడం కాదని చేతల్లో చూపించాలని ఆయన అన్నారు. భారత్​-చైనా మధ్య దౌత్యచర్చలు మొదలై 70 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఇరుదేశాలు సంయుక్తంగా స్మారక స్టాంప్ విడుదల చేయాలని గతంలో అనుకున్నాయి. అయితే ఈ కార్యక్రమం​ రద్దు అవ్వడానికి కారణం భారత్​ అని ఇటీవల చైనా ఆరోపించింది. ఈ ఆరోపణలను శ్రీవాస్తవ తప్పుబట్టారు.

"మేము గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే స్పష్టంగా ఉన్నాం. ఈ విషయంలో వారి దగ్గర నుంచి ఇటీవల ఎలాంటి స్పందన లేదు. ఆరు నెలలుగా సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగడానికి కారణం వాస్తవాధీన రేఖ వద్ద యథాతథస్థితిని చైనా ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నించడమే. ఈ చర్యలు ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలకు విరుద్ధం. ఎల్​ఏసీ వద్ద శాంతి స్థాపనకు ఈ ఒప్పందాలు కీలకం.

- అనురాగ్​ శ్రీవాస్తవ, భారత విదేశాంగ ప్రతినిధి

ఇరుదేశాల మధ్య తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చల్లారేందుకు సైనిక, దౌత్య చర్చలు కొనసాగుతాయని ఆయన అన్నారు.

"సరిహద్దులో శాంతిస్థాపన కోసం బలగాల ఉపసంహరణ చేయక తప్పదు. చైనాతో తదుపరి జరిగే చర్చల్లో ఈ మేరకు నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. వీలైనంత త్వరగా ఇది జరగాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.