ETV Bharat / bharat

బోఫోర్స్ కేసు విచారణపై వెనక్కు తగ్గిన సీబీఐ

author img

By

Published : May 16, 2019, 4:26 PM IST

బోఫోర్స్​ కేసు తదుపరి విచారణకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్​ను సీబీఐ ఉపసంహరించుకుంది. తదుపరి కార్యాచరణపై భవిష్యత్​ పరిణామాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దిల్లీ కోర్టుకు నివేదించింది.

బోఫోర్స్ కేసు విచారణపై వెనక్కు తగ్గిన సీబీఐ

బోఫోర్స్ కేసు విషయంలో సీబీఐ వైఖరి మార్చుకుంది. కేసుపై మరింత విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని కోరుతూ దిల్లీ కోర్టుకు సమర్పించిన దరఖాస్తును ఉపసంహరించుకుంది. తదుపరి ఏం చేయాలనేది సంస్థ తరువాత నిర్ణయిస్తుందని చీఫ్​ మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​కు నివేదించింది. సీబీఐ విజ్ఞప్తిని జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. దరఖాస్తు ఇచ్చినవారికి ఉపసంహరించుకునే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టంచేశారు. తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేశారు.

రూ. 64 కోట్లు విలువైన బోఫోర్స్ కుంభకోణంపై మరింత విచారణ జరిపేందుకు అనుమతి కోరుతూ 2018 ఫిబ్రవరి 1న దరఖాస్తు చేసింది సీబీఐ. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలు లభించినందునే విచారణ కొనసాగించాలని భావిస్తున్నట్లు అందులో పేర్కొంది.

ఇదీ కేసు...

రాజీవ్​ గాంధీ ప్రధాన మంత్రిగా ఉండగా 1986 మార్చి 24న స్వీడన్​కు చెందిన ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్​ సంస్థతో భారత్​ రూ.1,437కోట్లు విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో అక్రమాలు జరిగాయని 1987లో స్వీడన్​కు చెందిన ఓ రేడియో ఆరోపించింది.

రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన బోఫోర్స్ కుంభకోణంపై 1990 జనవరిలో సీబీఐ కేసు నమోదు చేసింది. చివరకు... సుదీర్ఘ విచారణ తర్వాత 2005 మార్చి మే 31న బోఫోర్స్ కేసును దిల్లీ హైకోర్టు కొట్టేసింది.

తీర్పు వచ్చిన దాదాపు 13ఏళ్ల తర్వాత... 2018 ఫిబ్రవరి 1న బోఫోర్స్​ కేసుపై మరింత విచారణ చేయాలని కోరుకుంటున్నట్లు చీఫ్​ మెట్రోపాలిటన్​ మేజిస్ట్రేట్​ కోర్టుకు దరఖాస్తు చేసింది సీబీఐ. మరుసటి రోజు... దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 90రోజుల్లో చేయాల్సిన అపీలును 4,500 రోజులు ఆలస్యంగా చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. సీబీఐ పిటిషన్​ను కొట్టేసింది. తాజాగా విచారణ కొనసాగింపుపై దిల్లీ కోర్టుకు చేసిన దరఖాస్తునూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుంది.

బోఫోర్స్​ కేసులో దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన మరో వ్యాజ్యం సుప్రీంకోర్టు వద్ద ఇంకా పెండింగ్​లో ఉంది.

Intro:Body:

zczc

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.