కరోనా లక్షణాలు ఏవి కనిపించినా తెగ కంగారు పడుతూ ఆస్పత్రుల చుట్టూ పరుగులు పెడుతున్నారు ప్రజలు. ఇలాగే యూపీలో ఓ వ్యక్తి ఆస్పత్రికి చేరుకోగా అతనికి కరోనా పరీక్షలు జరిపి పాజిటివ్‌గా ప్రకటించారు అక్కడి వైద్యులు. తర్వాత నిజం తెలిసి కంగుతిన్నారు.
ఏం జరిగింది?
ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా నౌగన్వా సాదత్ పట్టణానికి చెందిన 66 ఏళ్ల వ్యక్తి జలుబు, గొంతు నొప్పితో బాధపడుతూ మొరాదాబాద్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు రక్త నమూనాలు సేకరించి కరోనా పరీక్షల కోసం అలీగఢ్ పంపారు. రిపోర్టుల్లో పాజిటివ్ అని వచ్చింది. వెంటనే మొరాదాబాద్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వృద్ధుడి కుటుంబసభ్యులును నిర్బంధించారు. ఆయనతో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పొరపాటు అక్కడే...
ఈ తతంగం అంతా జరుగుతుండగా అసలు విషయం తెలిసింది. ఆ పెద్దాయనకు కరోనా సోకలేదని తేలింది. అలీగఢ్ పరీక్షా కేంద్రంలోని సిబ్బంది పొరపాటున నెగిటివ్‌గా బదులు పాజిటివ్ అని నివేదికలో రాశారని ఆలస్యంగా గుర్తించారు అధికారులు. కరోనా సోకిందని హడలిపోయిన వృద్ధుడి కుటుంబసభ్యులు... అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: 24 గంటల్లో 721 కొత్త కేసులు- 37 మంది మృతి