హిమాచల్‌ప్రదేశ్ మోదీపురంలోని 'కేంద్ర బంగాళదుంప పరిశోధన సంస్థ' (సీపీఆర్ఐ)లో పదేళ్ల నుంచి పరిశోధనలు జరిపి ఒక కొత్తరకం విత్తనాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. పూర్తిగా నీలి రంగులో ఉండే ఈ ప్రత్యేక బంగాళదుంపకు 'కుఫరీ నీలంకంఠ'గా నామకరణం చేశారు శాస్త్రజ్ఞులు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ఈ విత్తనాలను సాధ్యమైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
"8 నుంచి 10 సంవత్సరాలు పరిశోధనలు జరిపి ఈ కొత్త రకం బంగాళదుంప విత్తనాన్ని కనుగొన్నాం. శరీరంలోని క్యాన్సర్ కారకంపై ఇది పోరాడగలదు. ప్రస్తుతం దీన్ని పరీక్షిస్తున్నాం. మరో నాలుగైదు ఏళ్లలో రైతులు సాగు చేసుకునేందుకు అందుబాటులోకి తీసుకువస్తాం."
-సీపీఆర్ఐ పరిశోధకులు
ఇదీ చూడండి:చెర్రీ పూల సొగసు చూడతరమా?