ETV Bharat / bharat

మర్కజ్​కు వెళ్లిన విదేశీయులపై కేంద్రం కొరడా - కోవిడ్- 19 వార్తలు

పర్యటక వీసా మీద వచ్చి తబ్లిగీ కార్యక్రమాల్లో పాల్గొన్న విదేశీయులపై చర్యలు ప్రారంభించింది కేంద్ర హోంశాఖ. అయితే ఇప్పటివరకు ఎవరినీ బహిష్కరించలేదని.. వారిని బ్లాక్ లిస్ట్ లో చేర్చే ప్రక్రియ మొదలైందని స్పష్టం చేసింది.

markaz-MHA
విదేశీయులు
author img

By

Published : Apr 3, 2020, 6:52 PM IST

వీసా నిబంధనలను ఉల్లంఘించి తబ్లిగీ జమాత్ కార్యక్రమాల్లో పాల్గొన్న విదేశీయులపై కేంద్ర హోంశాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం దేశంలో ఉన్నవారితో పాటు లాక్ డౌన్​కు ముందు వారి స్వదేశాలకు వెళ్లిన 960 మందిని బ్లాక్ లిస్టులో చేర్చే ప్రక్రియ ప్రారంభించింది.

పర్యటక వీసా మీద వచ్చి తబ్లిగీ కార్యక్రమాల్లో పాల్గొన్న 960 మంది విదేశీయులను బహిష్కరించినట్లు వస్తున్న వార్తలపై హోంశాఖ స్పందించింది.

"ఇప్పుడు బహిష్కరించే పరిస్థితులు లేవు. పరిస్థితులు, ఆరోగ్య నిబంధనలను అనుసరించి బహిష్కరణపై నిర్ణయం తీసుకుంటాం. వీసా నిబంధనలు ఉల్లంఘించినవారిపై విదేశీయుల చట్టం, విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించాం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల డీజీపీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చాం. "

- కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి

వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించినట్లు హోంశాఖ తెలిపింది. వైద్య సిబ్బందికి సరైన భద్రత కల్పించాలని సూచించినట్లు పేర్కొంది.

దేశంలో వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న కరోనా కేసులకు దిల్లీ నిజాముద్దీన్ లోని తబ్లిగీ జమాత్ మర్కజ్ కేంద్ర బిందువులా మారింది. ఇక్కడ మార్చి 1 నుంచి 15 వరకు జరిగిన మత ప్రార్థనల్లో కరోనా సోకిన వ్యక్తులు పాల్గొన్నారు. వీరి ద్వారా చాలా మందికి వైరస్ సంక్రమించింది.

ఇదీ చూడండి: నిజాముద్దీన్​ ప్రార్థనల్లో పాల్గొన్న విదేశీయుల వీసాలు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.