భాజపాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. డబ్బు బలం, బెదిరింపు చర్యలతో ప్రభుత్వాలను పడగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాజాగా కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
"ఎక్కడైతే భాజపా డబ్బులిచ్చి, దెబ్బతీసి సర్కారును కూల్చేయగలదో... అక్కడ కచ్చితంగా ఆ పని చేస్తుంది. ముందు గోవాలో చూశాం. ఈశాన్య భారత దేశంలో చూశాం. ఇప్పుడు అదే పని కర్ణాటకలో చేయడానికి చూస్తోంది. ఇది వాళ్ల పద్ధతి. డబ్బులున్నాయి. పవర్ ఉంది. వాటిని భాజపా ప్రయోగిస్తోంది. ఇదే వాస్తవం."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
పరువు నష్టం కేసులో భాగంగా అహ్మదాబాద్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు రాహుల్. అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత... కాషాయ దళం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందన్నారు.
ఇదీ చూడండి: '4 వేల 800 మెడికల్ సీట్లు పేదలకే...'