స్వాతంత్య్ర దినోత్సవం రోజున జమ్ముకశ్మీర్‌లోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో జష్న్-ఎ-ఆజాదీ పేరిట సంబరాలు జరపాలని భాజపా నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా ఈ విషయం వెల్లడించారు.
వేర్వేరు గ్రామాల సర్పంచులతో జమ్ములో సమావేశమయ్యారు రవీందర్. పంద్రాగస్టు వేడుకల నిర్వహణపై చర్చించారు.
"ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం చారిత్రక నిర్ణయం తీసుకోవడంపై భాజపా కార్యకర్తలంతా సంబరాలు జరుపుకుంటారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి పంచాయతీ, వార్డు, వీధి స్థాయిలో జష్న్-ఎ-ఆజాదీ పేరిట వేడుకలు నిర్వహిస్తారు."
-రవీందర్ రైనా
ఇదీ చూడండి:కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు