పౌరసత్వ చట్టానికి (సీఏఏ) మద్దతు సమీకరించేందుకు భాజపా ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోందని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పౌర చట్టానికి మద్దతుగా సోమవారం సాయంత్రం వరకు 52.72 లక్షల ఫోన్‌కాల్స్ వచ్చినట్లు ప్రకటించారు.
డిసెంబర్ నెలలో పౌరసత్వ సవరణ బిల్లు చట్టం రూపం దాల్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు హోరేత్తాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు పౌరచట్టంపై అవగాహన కల్పించేందుకు 10 రోజుల పాటు ఇంటింటి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది భాజపా.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా దిల్లీలోని లజ్‌పత్ నగర్లో పర్యటించారు. అక్కడి ప్రజలకు పౌరచట్టం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు.
ఇదీ చూడండి:జల్లికట్టు కోసం తన ఎద్దు సిద్ధమంటోన్న విద్యార్థిని!