ETV Bharat / bharat

ఆ భాజపా ఎంపీ ఇంట్లో 12 మందికి కరోనా - కర్ణాటకలో కరోనా వైరస్

కర్ణాటకలోని గుల్బార్గా ఎంపీ, భాజపా నేత డాక్టర్​ ఉమేశ్​ జాదవ్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఉమేశ్ కుమారుడు, ఎమ్మెల్యే అవినాశ్ సహా మొత్తం 12 మంది వైరస్ బారిన పడినట్లు తెలిపారు జాదవ్​.

BJP MP, his MLA-son
భాజపా ఎంపీ ఇంట్లో కరోనా
author img

By

Published : Aug 24, 2020, 10:53 PM IST

కర్ణాటక భాజపా ఎంపీ డాక్టర్​ ఉమేశ్ జాదవ్​ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఆయన కుమారుడు, ఎమ్మెల్యే అవినాశ్ జాదవ్​తో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బందిలో మొత్తం 12 మందికి వైరస్ సోకింది.

"ఇప్పటివరకు నా కుటుంబం, వ్యక్తిగత సిబ్బందిలో 12 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. నా భార్య, కూతురు, కోడలు, నా డ్రైవర్​.. బెంగళూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం చేరారు."

- డాక్టర్ ఉమేశ్ జాదవ్​, గుల్బార్గా ఎంపీ

కాంగ్రెస్​ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను ఓడించేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2019 లోక్​సభ ఎన్నికల్లో పాల్గొన్నారు ఉమేశ్​. ఇందుకోసం కాంగ్రెస్​ నుంచి వీడి భాజపాలో చేరారు. భాజపా తరఫున చించొలి నియోజకవర్గం నుంచి తన కుమారుడికి టికెట్​ ఇప్పించుకున్నారు.

ఇదీ చూడండి: కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.