ETV Bharat / bharat

కీలక రాష్ట్రాల్లో భాజపా విజయబావుటా..!

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దిల్లీ, బిహార్, కర్ణాటక, రాజస్థాన్.. ఇలా కీలక రాష్ట్రాల్లో కమలం వికసించింది. ఎక్కడ చూసినా కాషాయ జెండా రెపరెపలాడుతోంది. మొన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట విజయం సాధించిన కాంగ్రెస్.. నేడు ఘోరంగా దెబ్బతింది. కర్ణాటకలో కాంగ్రెస్​ జేడీఎస్​ కూటమి ఎదురీదుతోంది. దిల్లీలో ఆమ్​ఆద్మీని దీటుగా ఎదుర్కొంది కమలం. బంగాల్​లోనూ కాషాయపార్టీ సత్తా చాటుతోంది.

author img

By

Published : May 23, 2019, 11:35 AM IST

కీలక రాష్ట్రాల్లో భాజపా విజయబావుటా

2019 సార్వత్రిక ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో కమలం సత్తా చాటింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లో విజయ బావుటా ఎగురువేసింది కాంగ్రెస్. అయితే ఏడాదికే అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ మూడు చోట్ల అధికార కాంగ్రెస్​ను కాదని ప్రజలు కమలానికి జై కొట్టారు.

దిల్లీలో కాషాయం...

దిల్లీలో ఆమ్​ఆద్మీని భాజపా దీటుగా ఎదుర్కొంది. దేశ రాజధానిలో పాగా వేయాలన్న కమలం కల నెరవేరింది. దిల్లీలో కాషాయ పార్టీ దూసుకుపోతోంది.

బంగాల్​లో అడుగు...

ఎన్నో ఏళ్లుగా బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ హవా నడుస్తోంది. అక్కడ దీదీని ఎదుర్కొని అడుగుపెట్టాలని భాజపా ఎప్పటినుంచో విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా బంగాల్​లో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇక్కడ కాలు మోపాలన్న భాజపా ఆశలు నెరవేరాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​కు ఇక్కడ గండి పడింది.

బిహార్​...

బిహార్​లో ఆర్​జేడీ, కాంగ్రెస్​ కూటమి ఎన్​డీఏకు గట్టిపోటీ ఇస్తుందని అంతా భావించారు. అయితే ఇక్కడ జేడీయూ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభంజనమే పైచేయి సాధించింది. ఇక్కడ కూటమి పాచికలు పారలేదు.

కర్ణాటకలోనూ కమలమే...

కర్ణాటకలో కమలాన్ని అధికారంలోకి రాకుండా చేయడంలో కాంగ్రెస్ సఫలమైంది. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఇక్కడ కథ తారుమారైంది. జేడీఎస్​- కాంగ్రెస్ కూటమిపై భాజపా పైచేయి సాధించింది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్​ఘడ్​...

ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ ఏడాదికే చతికిలపడింది. ఇక్కడ కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

Kalaburagi (Karnataka), May 23 (ANI): While speaking to ANI, Bharatiya Janata Party (BJP) candidate from Karnataka's Kalaburagi parliamentary constituency Umesh Jadhav showed hope of winning the seat. Jadhav said, "PM Narendra Modi will become the prime minister. I am hopeful of winning the seat. After this, within a day or two, this coalition government is going to fall on its own and BJP government will be formed." Umesh Jadhav is contesting against Congress' Mallikarjun Kharge.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.