భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కరోనా కేసులు, మరణాలు, దేశ జీడీపీ, చైనాతో ఇటీవల నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనపై సమాచారన్ని కప్పిపుచ్చుతోందంటూ ట్వీట్ చేశారు.
-
BJP has institutionalised lies.
— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
1. Covid19 by restricting testing and misreporting deaths.
2. GDP by using a new calculation method.
3. Chinese aggression by frightening the media.
The illusion will break soon and India will pay the price.https://t.co/YR9b1kD1wB
">BJP has institutionalised lies.
— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2020
1. Covid19 by restricting testing and misreporting deaths.
2. GDP by using a new calculation method.
3. Chinese aggression by frightening the media.
The illusion will break soon and India will pay the price.https://t.co/YR9b1kD1wBBJP has institutionalised lies.
— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2020
1. Covid19 by restricting testing and misreporting deaths.
2. GDP by using a new calculation method.
3. Chinese aggression by frightening the media.
The illusion will break soon and India will pay the price.https://t.co/YR9b1kD1wB
" భాజపా అబద్ధాలను సంస్థాగతం చేసింది. మరణాలను తప్పుగా నివేదించటం ద్వారా కరోనా డేటాను.. కొత్త గణన పద్ధతిని ఉపయోగించటం ద్వారా జీడీపీని.. మీడియాను భయపెట్టడం ద్వారా చైనా దురాక్రమణను కప్పిపుచ్చుతోంది. ఈ భ్రమ త్వరలోనే తొలిగిపోతుంది. దానికి భారత్ మూల్యం చెల్లించక తప్పదు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
అంతర్జాతీయ మీడియా సంస్థలో వచ్చిన ఓ కథనాన్ని తన ట్వీట్‌కు జోడించారు రాహుల్.
కొద్ది రోజులుగా కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు రాహుల్. శుక్రవారం చిన్న వీడియో ద్వారా భారత్-చైనా ప్రతిష్టంభన అంశంలో ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. 2014లో అధికారం చేపట్టిన నుంచి తీసుకున్న తప్పుడు నిర్ణయాలు దేశాన్ని బలహీనపరిచాయని పేర్కొన్నారు. గల్వాన్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సహా పలువురు పార్టీ నేతలు సైతం కేంద్రంపై విమర్శలు చేశారు. అసలు ఏ ప్రాంతంలో దాడి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఈ జాగ్రత్తలతో ఇక ఆన్‌లైన్‌లోనే ఆరోగ్యం!