రాష్ట్రాల వారీగా వ్యూహాలు అమలు చేస్తోన్న భాజపా.. 'న్యాయ్'పై అనుమానాలు లేవనెత్తుతోంది. పథకంతో పార్టీకి జరిగే నష్టంపైనా దృష్టి సారించింది. ప్రజల్లో వస్తోన్న స్పందనపై ఎప్పటికప్పుడు సర్వే, నిఘా సంస్థలతో నివేదికలు తెప్పించుకుంటోంది. ఈ పథకం ప్రజల్లోకి చేరి, వారు ఆకర్షితులైతే నష్టం తప్పదనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రియాంక అరంగేట్రం.. మరో సమస్య
ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని తాజాగా ప్రకటించారు. ఆమె ప్రకటన కార్యకర్తల్లోనూ నూతనోత్సాహం తెచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆమె పోటీ చేస్తే భాజపా, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో కమల దళం అంచనా వేసే పనిలో ఉంది.
ఇదీ చూడండి:భారత్ భేరి : మోదీకి జై... యడ్డీకి నై...!