రెండు నెలల పాటు హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దాదాపు అన్ని సర్వేలూ 'వచ్చేది మోదీ పాలనే!' అని అంచనాలు వెల్లడించాయి.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై భాజపా హర్షం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న ప్రజాదరణకు ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయని కాషాయ దళం స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు భాజపా ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు. ప్రధాని పాలనకు ప్రజలిచ్చిన బహుమతి భాజపా విజయమని వెల్లడించారు. సర్వేలు చెప్పినవాటి కన్నా మరిన్ని సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
" 'వచ్చేది మోదీ పాలనే...!' ఇదే నినాదం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందుకే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, 23న ఎగ్జిట్ పోల్స్ అంచనాలనూ అధిగమించి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం. ఇది మోదీ వల్లే సాధ్యమైంది. దేశాన్ని అభివృద్ధి చేసి.. ప్రధాని ప్రజల ఆశీర్వాదం పొందారు. ఇదే గుజరాత్‌లోనూ జరిగింది. మోదీ పాలన, క్రమశిక్షణ, నిజాయితీ ఈ ఫలితాలకు కారణం."
--- జీవీఎల్ నరసింహ రావు, భాజపా ప్రతినిధి.
'ఎగ్జిట్ పోల్స్ లెక్కలన్నీ తప్పులే...'
ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్. అవన్నీ తప్పుడు లెక్కలేనని అన్నారు. ప్రభుత్వం తరఫు మనుషులని భావించి ప్రజలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే వారికి నిజాలు చెప్పరని అభిప్రాయపడ్డారు.
ప్రతీ ఎగ్జిట్ పోల్ తప్పేమీకాదంటూ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్‌పైనా స్పందించారు శశిథరూర్. పోల్స్ అన్నీ తప్పుడులెక్కలేనని... తన వాదనకు ఆస్ట్రేలియాలో జరిగిన ప్రధాని ఎన్నికలపై నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ ఉదాహరణని ట్వీట్ చేశారు.
-
I believe the exit polls are all wrong. In Australia last weekend, 56 different exit polls proved wrong. In India many people don’t tell pollsters the truth fearing they might be from the Government. Will wait till 23rd for the real results.
— Shashi Tharoor (@ShashiTharoor) May 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I believe the exit polls are all wrong. In Australia last weekend, 56 different exit polls proved wrong. In India many people don’t tell pollsters the truth fearing they might be from the Government. Will wait till 23rd for the real results.
— Shashi Tharoor (@ShashiTharoor) May 19, 2019I believe the exit polls are all wrong. In Australia last weekend, 56 different exit polls proved wrong. In India many people don’t tell pollsters the truth fearing they might be from the Government. Will wait till 23rd for the real results.
— Shashi Tharoor (@ShashiTharoor) May 19, 2019
"నిజానికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పుడు లెక్కలే. భారత్ కన్నా ఎన్నో రెట్లు చిన్న దేశం అస్ట్రేలియాలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ దీనికి ఉదాహరణ. కానీ మీరు చెప్పింది నిజమే. ఎగ్జిట్ పోల్స్‌పై అనవసరమైన చర్చలు జరపడం కన్నా మే 23 కోసం ఎదురుచూడటం మంచిది."
--- శశిథరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఎగ్జిట్ పోల్స్‌పై విపక్షాలు మండిపడ్డాయి. నిజమేంటో ఈ నెల 23న తేలిపోతుందని వెల్లడించాయి. ఎగ్జిట్‌పోల్స్ వట్టి వదంతులని, వాటిని ప్రజలు నమ్మరని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు.
ఇదీ చూడండి- విహారి: 'వోల్గా'పై లాహిరి లాహిరి లాహిరిలో...