త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ఇంఛార్జీలను నియమించింది భారతీయ జనతా పార్టీ. అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు కొంతమంది కేంద్రమంత్రులను బాధ్యులుగా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రం | పార్టీ బాధ్యులు |
అసోం | నరేంద్ర సింగ్ తోమర్ |
తమిళనాడు | కిషన్ రెడ్డి |
కేరళ | ప్రహ్లాద్ జోషి |
పుదుచ్చేరి | అర్జున్ రామ్ మేఘ్వాల్ |
కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, వికే సింగ్‌లను అసోం, తమిళనాడుకు వరుసగా సహాయక బాధ్యులుగా నియమించింది. కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎన్ అశ్వథ్నారాయణ్ను కేరళకు, రాజీవ్ చంద్రశేఖర్‌ను పుదుచ్చేరికి సహాయక ఇంఛార్జీలుగా ప్రకటించింది.
ఈ నాలుగు రాష్ట్రాలకు ఏప్రిల్-మే లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
- ఇదీ చూడండి: టీఎంసీ నుంచి చేరికలకు భాజపా బ్రేకులు!