ETV Bharat / bharat

'భాజపా ఓ దుష్ట శక్తి- కరోనా కన్నా పెద్ద మహమ్మారి'

భాజపాపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాజపా ఒక దుష్ట శక్తి అని, కరోనా కంటే పెద్ద మహమ్మారి అని అభివర్ణించారు. తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన '​జాగో బంగ్లా ' కార్యక్రమంలో పాల్గొన్న దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

BJP an evil force, biggest pandemic: Mamata
భాజపాను దుష్ట శక్తిగా అభివర్ణించిన మమతా
author img

By

Published : Oct 12, 2020, 9:52 PM IST

భాజాపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రంలో భాజపా కేవలం అధికారం కోసమే ప్రయత్నిస్తోందని, ప్రజలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. భాజపాను ఓ దుష్ట శక్తిగా అభివర్ణించారు.

తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన 'జాగో బంగ్లా' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు దీదీ. ఈ నేపథ్యంలో తాను రాసిన 7పాటల ఆల్బమ్​ 'సృష్టి'ని విడుదల చేశారు.

"ఓ వైపు మనకు కొవిడ్​-19,డెంగీ ఉన్నాయి. మరోవైపు భాజపా లాంటి అతిపెద్ద మహమ్మారి కూడా ఉంది. భాజపా ఓ దుష్ట శక్తి బంగాల్​ రాజకీయాల్లోకి ప్రవేశించాలంటే కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండాలి."

---మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

కొన్ని రోజుల క్రితం భాజపా శ్రేణులు బంగాల్​ వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీకి అనుమతి తీసుకోలేదని, కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ జరిగిందని బంగాల్​ ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిరాడంబరంగా దుర్గా పూజ

కొవిడ్​-19 నిబంధనలకు కట్టుబడి దుర్గా పూజ కమిటీలు పూజలు నిర్వహించాలని దీదీ సూచించారు. చాలా రాష్ట్రాల్లో ఈసారి దుర్గా ఉత్సవాలను రద్దు చేశారని తెలిపారు. తగు జాగ్రత్తలతో పూజ చేసుకోవాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :కరోనా వేళ బిహార్​లో 'పోస్టల్ బ్యాలెట్'​ వైపే మొగ్గు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.