ETV Bharat / bharat

'బంగాల్ పరిపాలనలో ప్రశాంత్ కిశోర్ జోక్యం'

బంగాల్ సీఎం మమతా బెనర్జీ అండతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్ రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారని భాజపా ఆరోపించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రజాభిప్రాయం తెలుసుకునే నెపంతో అధికారులు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ప్రశాంత్ కిశోర్ బృందం ఆదేశిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు. ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్, ప్రశాంత్ కిశోర్​ బృందం, ఐ-పీఏసీ ఖండించాయి.

'బంగాల్ పరిపాలనలో ప్రశాంత్ కిశోర్ జోక్యం'
author img

By

Published : Aug 11, 2019, 5:15 PM IST

Updated : Sep 26, 2019, 4:08 PM IST

పశ్చిమ బెంగాల్​లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్ బృందం... రాష్ట్ర పరిపాలనలో కలుగజేసుకుంటోందని... భాజపా జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు.​ అధికారులు తాము చెప్పిందే వినాలని కిశోర్​ బృందం ఒత్తిడి తెస్తోందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన విమర్శించారు.

అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్​సీ), ప్రశాంత్​ కిశోర్​ సంస్థ, ఇండియన్ పొలిటికల్ యాక్షన్​ కమిటీ (ఐ-పీఏసీ)... భాజపా ఆరోపణలను ఖండించాయి.

కిశోర్​పైనే మమత ఆశలు

సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​కు చావుతప్పి కన్నులొట్టపోయింది. ఈ నేపథ్యంలో 2021 బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్​ కాంగ్రెస్... ప్రశాంత్​ కిశోర్​ బృందం, 'ఐ-పీఏసీ'ని నియమించుకుంది.

ప్రశాంత్​ కిశోర్ సూచన మేరకు.. ప్రజల కోసం హెల్ప్​లైన్, వెబ్​సైట్​లను మమతాబెనర్జీ ప్రభుత్వం ప్రారంభించింది. ఫలితంగా ప్రజలు నేరుగా తమ సమస్యలు, ఫిర్యాదులను ప్రభుత్వానికి తెలుపడానికి అవకాశం ఏర్పడింది.

ఇది సరికాదు

"మీడియా నివేదికల ప్రకారం... ప్రశాంత్​ కిశోర్, అతని బృందం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నారు. ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకోనే నెపంతో అధికారులు ఏమి చేయాలి, ఏమి చేయకూడదో నిర్దేశిస్తున్నారు."

"తృణమూల్​ కాంగ్రెస్ ప్రశాంత్ కిశోర్ సలహాలు తీసుకోవడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. టీఎంసీ మునిగిపోతున్న నౌక. ప్రశాంత్​ కిశోర్ అయినా, మరే రాజకీయ వ్యూహకర్త అయినా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కాపాడలేరు."- రాహుల్ సిన్హా, భాజపా జాతీయ కార్యదర్శి

ఒక పార్టీ (టీఎంసీ) ప్రభుత్వ కార్యకలాపాలను ఎలా రాజకీయ చేస్తుంది? అని రాహుల్​ సిన్హా ప్రశ్నించారు.

నిరాధార ఆరోపణలు

భాజపా ఆరోపణలు బంగాల్​ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, టీఎంసీ సీనియర్ నేత పార్థా ఛటర్జీ తోసిపుచ్చారు. మీడియా కథనాలు, రాహుల్​ సిన్హాలవి నిరాధార ఆరోపణలని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల వద్దకు నేతలు

తృణమూల్ కాంగ్రెస్ హెల్ప్​లైన్, వెబ్​సైట్​ ప్రారంభించడం సహా, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని కింద వెయ్యి మంది పార్టీ నేతలు రాబోయే 100 రోజుల్లో పదివేల గ్రామాల్లో పర్యటిస్తారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేస్తారు.

ఇదీ చూడండి: హోదా రద్దుతో జమ్ముకశ్మీర్​కు ఇలా మేలు..!

New Delhi, Aug 11 (ANI): Ahead of the 73rd Independence Day celebration, a unique bike rally was organised in the national capital on August 11. Bikers began their journey from Rajouri Garden area of Delhi. Over 200 super bikes led by a team including 20 women bikers participated in the rally. Several bike groups including The Harley Group participated in the rally.
Last Updated : Sep 26, 2019, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.