దుండగులు ఏ సమయంలో ఏ రూపంలో విరుచుకుపడుతున్నారో తెలియడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలోని జవాన్ ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్‌లోకి బైక్‌పై వచ్చిన దుండగులు.. అక్కడ పని చేసే సిబ్బందిని తుపాకీతో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
సులభంగా డబ్బు సంపాదించాలన్న ధ్యాసలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు కొందరు యువకులు.
ఒంటరిగా ఉన్న కుర్రాడిని తుపాకీతో బెదిరించి రూ.2,500/- లాక్కున్నాడో దుండగుడు. అనంతరం మరో ఇద్దరితో.. ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై ఎక్కి పరారయ్యారు. భయభ్రాంతులకు గురైన యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
" ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. అందులో ఒకరి దగ్గర తుపాకీ ఉంది. పెట్రోల్ పంప్ సిబ్బంది నుంచి రూ.2500/- దోచుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. త్వరలో నిందితులను పట్టుకుంటాం. "
-అభిషేక్, అలీగఢ్ ఎస్పీ
ఇదీ చూడండి: చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ షురూ.. రేపే ప్రయోగం