ETV Bharat / bharat

బిహార్​ బరి: సీట్ల లెక్కలు పూర్తి- గెలుపుపైనే గురి - బిహార్​ శాసనసభ

బిహార్ ఎన్నికల్లో కీలక పర్వాలు పూర్తయ్యాయి. ఎడతెగని చర్చలు కొలిక్కిరాగా సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది. కేటాయింపులు పూర్తయిన అనంతరం పార్టీలన్నీ సమరోత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.

Bihar seat sharing
బిహార్​ బరి: పూర్తైన సీట్ల సర్దుబాటు.. కదనరంగంలోకి పార్టీలు
author img

By

Published : Oct 7, 2020, 4:13 PM IST

Updated : Oct 7, 2020, 5:18 PM IST

దేశంలో కరోనా సంక్షోభంలోనే జరగనున్న మొదటి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 2020 బిహార్​ శాసనసభ ఎన్నికల సన్నాహకాలు పూర్తి స్థాయిలో జరుగుతుంటే.. పార్టీలు పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నాయి. ముఖ్యంగా పొత్తుల రాజకీయాలకు వేదికగా నిలిచే బిహార్​లో.. సీట్ల పంపకాలపై మీమాంస వీడిన నేపథ్యంలో గెలుపు గుర్రాలపై సవారీ చేయాలని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

కూటముల ఎత్తులు..

243 స్థానాలున్న బిహార్​ శాసనసభలో.. మెజార్టీ స్థానాలు దక్కించుకోవటమే ప్రస్తుతం పార్టీల లక్ష్యం. అందుకే ఎవరు ఏ స్థానం నుంచి బరిలో దిగితే గెలుపు ఖాయమోనని విస్తృత కసరత్తు చేశాయి ప్రధాన పార్టీలు. ఎట్టకేలకు కూటముల్లో సీట్ల పంపకాలు పూర్తి చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీగా ఆర్జేడీ నిలిచింది.

Bihar seat sharing
ఇరు కూటములు సీట్ల సర్దుబాటు

ప్రచార హోరు...

బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌-ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి జోరు పెంచింది. ఎన్‌డీఏ సీట్ల సర్దుబాటులోనే తలమునకలై ఉండగానే మహాకూటమి అభ్యర్థులను ప్రకటించింది. మహాకూటమి సీట్ల పంపకాల్లో భాగంగా ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, సీపీఐఎంఎల్‌ 19, సీపీఐ 6, సీపీఎం 4 చోట్ల పోటీ చేస్తున్నాయి.

243 స్థానాలకుగాను జేడీయూకు 122, భాజపాకు 121 స్థానాలు కేటాయింపులు జరిగిన తర్వాత.. ఎన్డీఏ సైతం సమరశంఖం పూరించింది. జేడీయూకు కోటా సీట్లలో 7 స్థానాలను బిహార్‌ మాజీ సీఎం జితన్‌ రాం మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చాకు కేటాయించారు. భారతీయ జనతా పార్టీ తనకు కేటాయించిన సీట్లలో 11స్థానాలు వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీకి ఇవ్వనున్నట్లు తెలిపారు. నితీశ్‌ కుమారే తమ నేత అని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని బిహార్‌ భాజపా స్పష్టం చేస్తోంది.

మహాకూటమి వ్యూహం

రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ బిహార్‌లో ప్రతిపక్ష కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజలకు, డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వానికి మధ్య పోరాటమని ఆయన చెబుతున్నారు. ఇక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని మహాకూటమి వ్యూహం రచిస్తోంది. దానితో పాటు కరోనాను ఎదుర్కోవడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేయాలని యోచిస్తోంది.

ఇదీ చూడండి: బిహార్​ బరి: కంచు కోటలపై పట్టు నిలిచేనా?

ఎల్​జేపీ ఒంటరి పోరు

యువ నేత చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. నితీశ్‌ కుమార్‌ సారథ్యంలోని జేడీయూతో కలిసి పోటీచేయబోమని తేల్చిచెప్పింది. బిహార్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పోరాటానికి సన్నద్ధమవుతోంది. జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలో దింపుతామని ప్రకటించిన ఎల్​జేపీ... భాజపాతో మాత్రం తమ దోస్తీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'జేడీయూకు ఓటేయొద్దు.. భాజపా-ఎల్​జేపీదే గెలుపు'

భాజపా వ్యూహంలో మార్పు?

బిహార్‌ ఎన్నికల్లో భాజపా ప్రణాళిక మార్చుకుంటునట్లుగా కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై మరోసారి కసరత్తు ప్రారంభించింది. దాదాపు 143 స్థానాల్లో ఎల్​జేపీ తమ అభ్యర్థులను నిలబెట్టనున్న క్రమంలో కుల సమీకరణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని భాజపా నిర్ణయానికి వచ్చింది. 27 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.

ఇదీ చూడండి: నితీశ్​కు చెక్​ పెట్టేందుకే భాజపా వ్యూహం!

ఎల్‌జేపీ నేతలు నితీశ్​ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగుతున్నారు. జేడీయూ అభ్యర్థుల ఓటమే తమ లక్ష్యమని ఇదివరకే ప్రకటించారు. దీంతో భాజపా కావాలనే ఎల్‌జేపీని తమపై పోటీకి దింపుతోందని పలువురు జేడీయూ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇదే నిజమైతే... ఈ ఎత్తులను నితీశ్​ ఏ విధంగా ఎదుర్కొంటారనేది బిహార్‌ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది.

మరికొన్ని చిన్న పార్టీలు సైతం ఎన్నికల్లో సత్తా చాటాలని ఊవిళ్లూరుతున్నాయి. అందులో భాగంగా పొత్తులు కుదుర్చుకుని పోటీకి సిద్ధమవుతున్నాయి.

ఎన్నికల క్రతువు

బిహార్​ ఎన్నికల్లో క్రతువులో అక్టోబర్‌ 8తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, 7వ తేదీలలో పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు నవంబర్‌ 10న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం నాలుగోసారి కూడా తాము అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమాగా ఉంది.

Bihar seat sharing
2015 ఫలితాలు

ఇదీ చూడండి: 'బిహార్​ ఎన్నికల ప్రచారానికి 47 మైదానాలు, 19 హాళ్లు'

ఇదీ చూడండి: బిహార్ బరి: నేరచరితుల భార్యలదే హవా!

Last Updated : Oct 7, 2020, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.